మరో కొత్త మార్గంలో విమాన సేవలను ప్రారంభించిన Akasa Air

by Disha Web Desk 17 |
మరో కొత్త మార్గంలో విమాన సేవలను ప్రారంభించిన Akasa Air
X

న్యూఢిల్లీ: ఇటీవలే భారత విమానయాన రంగంలో కార్యకలాపాలు ప్రారంభించిన ఆకాశ ఎయిర్ శుక్రవారం కొత్తగా బెంగళూరు-ముంబై మధ్య మొదటి విమానాన్ని ప్రారంభించింది. ఈ మార్గంలో ఒకవైపుకు రోజూ రెండుసార్లు విమాన సేవలు అందించనున్నామని ఆకాశ ఎయిర్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే కంపెనీ ముంబై-అహ్మదాబాద్, బెంగళూరు-కొచ్చి మార్గాల్లో విమానాలను విజయవంతంగా కొనసాగిస్తోంది.

అలాగే, సంస్థ కొత్తగా బెంగళూరు-చెన్నై మధ్య విమానాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇది సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభమవుతుందని, రానున్న రోజుల్లో ఇదే స్థాయిలో దేశవ్యాప్తంగా విమాన సేవలు అందించనున్నట్లు కంపెనీ వివరించింది. ప్రతి రెండు వారాలకు ఒక కొత్త విమానాన్ని కార్యకలాపాల్లో వినియోగిస్తామని, ప్రధానంగా కంపెనీ మెట్రో, టైర్ 2, టైర్ 3 ప్రాంతాల్లో విమాన సేవలందించడంపై దృష్టి సారించినట్టు పేర్కొంది.

2023, మార్చి నాటికి మొత్తం 18 విమానాలను అందుబాటులో ఉంచనుంది. అలాగే, రాబోయే నాలుగేళ్లలో 54 ఫ్లైట్లు, మొత్తం 72 విమానాలతో కార్యకలాపాలను నిర్వహించనున్నట్టు ఆకాశ ఎయిర్ సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ ప్రవీణ్ అయ్యర్ వెల్లడించారు.


Next Story

Most Viewed