- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఎయిర్‌టెల్ వినియోగదారుల కోసం రెండు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు లాంచ్
న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ రెండు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను సోమవారం తీసుకొచ్చింది. భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరో దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో తెచ్చిన రీఛార్జ్ ప్లాన్‌లను తెచ్చిన అనంతరం ఎయిర్‌టెల్ వీటిని ప్రకటించింది. రూ. 519, రూ. 779 ధరలతో రెండు ప్లాన్‌లను ఎయిర్‌టెల్ ప్రకటించింది.
ఈ రెండింటి ద్వారా వినియోగదారులకు రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఇందులో రూ. 519 ప్లాన్‌కు రెండు నెలలు, రూ. 779 ప్లాన్‌కు 3 నెలల వ్యాలిడిటీ వస్తుంది. అలాగే, హై-స్పీడ్ ఇంటర్నెట్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, ఇంకా ఇతర ప్రయోజనాలు లభిస్తాయని కంపెనీ తెలిపింది.
ఈ రెండు ప్లాన్‌లలోనూ ఎయిర్‌టెల్ థ్యాంక్స్‌తో పాటు ఉచిత అపోలో 24/7 సర్కిల్, వింక్ మ్యూజిక్, ఫాస్ట్‌ట్యాగ్‌లో రూ. 100 క్యాష్‌బ్యాక్ వంటి ప్రయోజనాలున్నాయి. పూర్తిగా నెలవారీ వ్యాలిడిటీ ఆశించే వినియోగదారులకు ఈ రెండు ప్లాన్‌లు ఉపయోగపడతాయని కంపెనీ అభిప్రాయపడింది.