కస్టమర్లకు గుడ్ న్యూస్ : కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చిన Airtel..

by Disha Web Desk 20 |
కస్టమర్లకు గుడ్ న్యూస్ : కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చిన Airtel..
X

దిశ, ఫీచర్స్ : ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తన కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రారంభించింది. అంతే కాదు ఒక కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టింది. వినియోగదారుల సౌకర్యార్థం తక్కువ ధరలో అపరిమిత డేటాతో పాటు అదనపు ప్రయోజనాలు కూడా కల్పించింది.

ఇక ప్లాన్స్ విషయానికి వస్తే మార్చిన ప్లాన్‌లలో రూ. 99 ప్రీ-పెయిడ్ ప్లాన్ కూడా ఉంది. ఎయిర్‌టెల్ రూ.99 ప్లాన్ ధర రూ.20 తగ్గి రూ.79 కి చేరుకుంది. అలాగే రూ. 39, రూ. 49 రెండు రీఛార్జ్ ప్లాన్‌లను కూడా ప్రారంభించారు.

ఎయిర్‌టెల్ రూ. 39 ప్లాన్..

డేటా ప్యాక్ ప్లాన్ ధర రూ.39. ఈ ప్లాన్‌లో అపరిమిత డేటా అందించనున్నారు. ఈ ప్లాన్ చెల్లుబాటు 1 రోజు మాత్రమే.

ఎయిర్‌టెల్ రూ.49 ప్లాన్..

ఎయిర్‌టెల్ రూ.49 ప్లాన్‌లో మార్పులు చేశారు. ఈ ప్లాన్ 1 రోజు వాలిడిటీతో వస్తుంది. అలాగే అపరిమిత తేదీ ప్లాన్‌తో కూడా వస్తుంది. ఈ ప్లాన్‌లో 30 రోజుల పాటు ప్లస్ వింక్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంది.

ఎయిర్‌టెల్ రూ. 79 ప్లాన్..

ఈ రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులకు రెండు రోజుల పాటు అపరిమిత డేటా అందించనున్నారు. ఈ ప్లాన్ వాలిడిటీ 2 రోజులు మాత్రమే.

Next Story

Most Viewed