విమాన ఛార్జీలు పెంచిన ఇండిగో

by Dishanational1 |
విమాన ఛార్జీలు పెంచిన ఇండిగో
X

దిశ, బిజినెస్ బ్యూరో: విమాన ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రముఖ ఎయిర్‌లైన్ కంపెనీ ఇండిగో విమానాల్లో ముందువరుస సీట్ల కోసం ప్రయాణీకులు అదనంగా రూ. 2,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఛార్జీలను పెంచుతూ విమానయాన సంస్థ నిర్ణయం తీసుకుంది. సంస్థ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, వివిధ సేవలకు పేర్కొన్న ఛార్జీలకు సంబంధించి 232 సీట్లు ఉన్న ఏ321 విమానంలో ముందు వరుస విండో సీటు కోసం రూ. 2,000 ఎక్కువ ఖర్చు అవుతుంది. మధ్య సీటు కోసమైతే రూ. 1,500 ఖర్చు అవనుంది. 222 సీట్లు కలిగిన ఏ321, 186 సీట్లు ఉన్న ఏ320 విమానాల్లో సీట్ల కోసం ఒకే ఛార్జీలను కొనసాగించనున్నారు. 180 సీట్లు ఉండే ఏ320 విమానంలోనూ ఇదే టారిఫ్ వర్తిస్తుంది. ఏటీఆర్ విమానాల్లో సీట్లను ఎంచుకునేందుకు అదనంగా రూ. 500 వరకు ఖర్చు అవనుంది. గతవారమే ఇండిగో సంస్థ ప్రయాణీకుల నుంచి వసూలు చేసే ఇంధన ఛార్జీని ఉపసంహరించుకుంది. దీనివల్ల నిర్దిష్ట దూరాలకు విమానయాన ఛార్జీలు రూ. 1,000 వరకు తగ్గుతాయి.

Next Story

Most Viewed