ఫస్ట్ టైం ఓటు వేస్తున్న వారికి ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్

by Disha Web Desk 17 |
ఫస్ట్ టైం ఓటు వేస్తున్న వారికి ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్
X

దిశ, బిజినెస్ బ్యూరో: 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఓటర్లను ప్రోత్సహించడానికి ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కును వినియోగించుకునే వారి కోసం తన విమాన చార్జీలపై 19 శాతం తగ్గింపును ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ సర్వీసులకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ రాయితీ పొందాలనుకునే వారు 18 నుంచి 22 ఏళ్ల వయస్సు వారై ఉండాలి. ఓటు వేయబోయే నియోజకవర్గానికి దగ్గరగా ఉన్నటువంటి ఎయిర్‌పోర్ట్‌ను ఎంచుకోవాలి. ఈ ఆఫర్ క్రింద ప్రయాణం చేయాలనుకునే వారు తప్పనిసరిగా గుర్తింపు పత్రాలను చూపించాల్సి ఉంటుంది. టికెట్ బుక్ చేసుకున్న వారు ఏప్రిల్ 18 నుంచి జూన్ 1 మధ్య ప్రయాణించాలి. మొబైల్ యాప్, కంపెనీ వెబ్‌సైట్ ద్వారా బుకింగ్‌ చేసుకోవచ్చు.

ఎక్స్‌ప్రెస్ లైట్, ఎక్స్‌ప్రెస్ వాల్యూ, ఎక్స్‌ప్రెస్ ఫ్లెక్స్, ఎక్స్‌ప్రెస్ బిజ్ అనే నాలుగు కేటగిరీలలో మొదటిసారి ఓటు వేస్తున్న వారు ఈ ఆఫర్‌ను పొందవచ్చని ఎయిర్‌లైన్ తెలిపింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ డాక్టర్ అంకుర్ గార్గ్ మాట్లాడుతూ, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎల్లప్పుడూ మార్పులకు అనుగుణంగా పనిచేస్తుంది, సరిహద్దులు దాటి ప్రజలను, ప్రదేశాలను, సంస్కృతులను ఏకం చేస్తుందని అన్నారు.

Next Story

Most Viewed