ముందస్తు రుణాలను చెల్లించనున్నట్టు ప్రకటించిన అదానీ గ్రూప్!

by Disha Web Desk 17 |
ముందస్తు రుణాలను చెల్లించనున్నట్టు ప్రకటించిన అదానీ గ్రూప్!
X

న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా వరుసగా భారీ నష్టాలను ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ సోమవారం కీలక ప్రకటన వెల్లడించింది. కంపెనీ తాకట్టు పెట్టిన షేర్లను విడిపించేందుకు గాను రుణ సంస్థలకు 1,114 మిలియన్ డాలర్ల(రూ. 9 వేల కోట్లకు పైగా) చెల్లించనున్నట్టు తెలిపింది. వీటికి 2024, సెప్టెంబర్ వరకు గడువు ఉన్నప్పటికీ ముందుగానే చెల్లింపులులకు కంపెనీ నిర్ణయించింది. ఈ ప్రక్రియ పూర్తయితే అదానీ పోర్ట్స్‌లోని 12 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్ 1.4 శాతం షేర్లు తాకట్టు నుంచి బయటపడనున్నాయి.

వీటికి సంబంధించి తీసుకున్న రుణాలను ముందస్తు చెల్లింపులు చేస్తామని ప్రమోటర్లు ఇంతకుముందే హామీ ఇచ్చారని, ప్రస్తుతం స్టాక్ మార్కెట్ల అనిశ్చితి నేపథ్యంలో ఈ నిర్ణయం సరైందిగా భావిస్తున్నట్టు కంపెనీ వివరించింది. కాగా, ఇటీవల అమెరికా పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక కారణంగా అదానీ కంపెనీల షేర్లు భారీ పతనాన్ని చూసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ కంపెనీల షేర్లు నష్టాలను ఎదుర్కొంటున్నాయి.


Next Story

Most Viewed