క్రియా విశ్వవిద్యాలయంలో 2023-26 UG ప్రొగ్రామ్‌కి అడ్మిషన్లు ప్రారంభం

by Disha Web Desk 17 |
క్రియా విశ్వవిద్యాలయంలో 2023-26 UG ప్రొగ్రామ్‌కి అడ్మిషన్లు ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: స్కూల్ ఆఫ్ ఇంటర్వొవెన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఎస్ఐఎఎస్), క్రియా విశ్వవిద్యాలయంలో బిఎ(ఆనర్స్), బిఎస్‪సి(ఆనర్స్) అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రాముల్లో 2023-26 గాను మొదటి రౌండ్ అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ తొలి రౌండ్ అడ్మిషన్లు 2022 డిసెంబర్ 5న ముగుస్తాయి.

ఈ ఏడాది జులైలో, అండర్ ‪గ్రాడ్యుయేట్ స్కూల్లో వ్యవస్థాపక తరగతి విద్యార్థులు గ్రాడ్యుయేట్ చేయడం ద్వారా భారతదేశపు మొట్టమొదటి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో లిబరల్ ఎడ్యుకేషన్ విశ్వవిద్యాలయం విజయవంతమైందనడానికి సూచనగా నిలిచేరు. దేశంలో ఉన్నత విద్య రూపురేఖల్ని పునర్ లిఖించే దిశగా క్రియా విశ్వవిద్యాలయం దృఢంగా అడుగులేస్తోంది.


క్రియా గ్రాడ్యూయేట్లు ఆశావహమైన ఉన్నత విద్యావకాశాల కోసం ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం, హారిస్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, చికాగో విశ్వవిద్యాలయం, కార్నీజ్ మెలాన్ విశ్వవిద్యాలయం వంటి ప్రపంచవ్యాప్త ఎన్నో విశ్వవిద్యాలయాలకు వెళ్ళగా, మరికొంత మంది ప్రముఖ సంస్థల్లో పురోభివృద్ధి దాయక కెరీర్ పాత్రలని స్వీకరించారు.ఎస్ఐఎఎస్ వారి నిర్దుష్టమైన, ప్రతిభ ఆధారిత, సమగ్ర రెండు దశల అడ్మిషన్ల క్రమం దరఖాస్తుదారు ప్రొఫైల్ లో ప్రతి అంశాన్ని అర్థం చేసుకోవడానికి ఉద్దేశించింది. ఇది వారి పాండిత్యానికి మించి, విశ్వవిద్యాలయంలో విద్యార్జనకి కావాల్సిన విద్యావిషయక వేదికని ఏర్పాటు చేసే మౌలిక గుణాలని చూస్తుంది. సామాజిక-ఆర్థిక రంగాల్లో సవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యాల నుంచి వచ్చే వారికి ఆర్థిక సహకారం అందించే కార్యక్రమం కూడా అందుబాటులో ఉంటుంది.

క్రియా విశ్వవిద్యాలయం మూడేళ్ళ బిఎ (ఆనర్స్) & బిఎస్‪సి (ఆనర్స్) డిగ్రీలని, నాలుగో ఏడాది అడ్వాన్స్‪డ్ స్టడీస్ చేసే వీలుతో అందుబాటులో ఉంచుతోంది. మొదటి ఏడాది పాఠ్యాంశాలు క్రియా వారి ప్రత్యేక ఇంటర్వొవెన్ లెర్నింగ్ నమూనా ఆధారంగా రూపుదిద్దినవి, ఇవి వారి కెరీర్ ని, జీవిత ఆసక్తులకు ఉత్తమంగా నప్పేలా మేజర్ ని గుర్తించుకోవడానికి విద్యార్థులకు దోహదం చేస్తాయి.

క్రియాలో అవసరమైన 11 కోర్ అండ్ స్కిల్స్ కోర్సులు పూర్తి చేసిన తర్వాత, విద్యార్థులు రెండో సంవత్సరంలో మేజర్ ని ఎంపిక చేసుకోవచ్చు. ఈ విశ్వవిద్యాలయం 12 విభాగాల్లో మేజర్స్ ని, నాలుగు జాయింట్ మేజర్స్ ని, 15 మైనర్లని అందుబాటులో వుంచుతోంది, ఇవన్నీ డివిజన్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, డివిజన్ ఆఫ్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్, డివిజన్ ఆఫ్ సైన్సెస్ క్రింద ఉంటాయి.

ప్రొఫెసర్ నిర్మలా రావు, వైస్-ఛాన్స్‪లర్, క్రియా విశ్వవిద్యాలయం, ఈ పాఠ్యాంశాల గురించి మాట్లాడుతూ "క్రియాలో మేము, 21వ శతాబ్దానికి విద్యని పునరాలోచించి నిర్ణయించాము. క్రియాలో జీవిత మార్గం అంతర్ విభాగాలకు మించింది, ఇది ఇంటర్వొవెన్. మేం ఇక్కడ, ప్రపంచాన్ని చుట్టుముడుతున్న సంక్లిష్టమైన సమస్యలకి అనుదినం ఎదురయ్యే సవాళ్ళకి మధ్య సంబంధాలను ఏర్పరచి, వాటినన్నింటినీ ఇంటర్వొవెన్ దృక్కోణం ద్వారా చూడనిస్తాం.

నిజమైన విద్యావిషయక ప్రతిభ, సామర్థ్యాలు ఎప్పుడూ కేవలం పరీక్షల్లో మార్కుల ద్వారా మాత్రమే వెల్లడి కావన్నది మా అవగాహన. అంచేత, మేం కేవలం మార్కులు, స్కోర్ల మీద మాత్రమే దృష్టిపెట్టం, దానికి బదులు మా ఎంపిక క్రమంలో మేం వివిధ అంశాల ద్వారా విద్యావిషయక ప్రతిభని గుర్తించాలని ఆశిస్తాం.

స్వేచ్ఛగా విశాలంగా ఆలోచించడం, ఉత్సుకత, సహానుభూతి, టీం వర్క్, సృజనాత్మకత, స్వీయచైతన్యం ఆధారంగా మేం విద్యార్థిని అంచనా వేస్తాం. ఈ గుణాలని ప్రదర్శించడానికి తగినన్ని అవకాశాలు వుండేలా మేం మా అడ్మిషన్ విధాన క్రమాన్ని రూపుదిద్దేం. యోగ్యులైన అభ్యర్థుల విశ్వవిద్యాలయ విద్యావకాశాల ఆశలు నీరుగారకుండా వుండేలా చూసేందుకుగాను, అర్హతగలిగిన ఆశావహులకు దృఢమైన ఆర్థిక సహాయం చేసి వారి కృషికి సాయపడ్డంకూడా జరుగుతుంది" అనికూడా చెప్పేరు.

అడ్మిషన్ల విధాన క్రమం

వైవిధ్యత, సమగ్రతల్లో వేళూనుకుని రూపుదిద్దుకున్న క్రియా లక్ష్యానికి అనుగుణంగా, ఆశావహులకు ఒకే ఒక్కటి కాకుండా భిన్నమైన పలు నైపుణ్యాల ద్వారా అంచనా వేసుకునే అవకాశాన్ని క్రియా కలిగిస్తోంది. ఇది అభ్యర్థులు వారికి వారుగా నిజంగా నిలబడేలా చేయడమే కాకుండా, క్రియా వారికి సరైనదేనా అన్నది మేం అర్థం చేసుకోవడానికి కూడా దోహదం చేస్తుంది.

అడ్మిషన్ విధాన క్రమంలో, తగిన విధంగా పూర్తిగా నింపిన దరఖాస్తు దాఖలు చేయడం, దాని వెంట క్రియా ఆప్టిట్యూడ్ పరీక్ష, క్రియా ఇమ్మర్సివ్ కేస్ అనాలసిస్/లేదా వ్యక్తిగత ఇంటర్వ్యూ వుంటాయి.

అర్హులైన విద్యార్థులకు కాలేజీ బోర్డు ఇండియా స్కాలర్స్ ప్రోగ్రాం, క్రియా విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో 100% స్కాలర్షిప్ అందిస్తుంది. ఎస్ఎటి లో 1300 లేదా అంతకు మించి స్కోర్ చేసిన భారతదేశంలోని విద్యార్థులను, వార్షిక పద్ధతిలో ఏప్రిల్ చివరికి టాప్ పెర్ఫార్మర్స్ గా కాలేజీ బోర్డు గుర్తిస్తుంది.

ఏడాదికి 8,00,000 రూపాయల కన్నా తక్కువ కుటుంబ ఆదాయం కలిగి, నిజమైన ఆర్థిక అవసరాన్ని ప్రదర్శించగలిగిన టాప్ పెర్ఫార్మర్స్, క్రియా విశ్వవిద్యాలయంలో వారి విద్యా కార్యక్రమంలో యావత్ కాలానికి మొత్తం ట్యూషన్ ఫీజు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు.

అర్హత

వారి వారి దేశాల్లో XII గ్రేడ్ లేదా తత్సమానమైన విద్యని పూర్తి చేసిన లేదా చదువుతున్న, 2023 ఆగస్టు 1వ తేదీకి 21 ఏళ్ళు నిండిన విద్యార్థులు అండర్ ‪గ్రాడ్యుయేట్ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బోర్డు విద్య ఏదైనప్పటికీ దాని గురించి పట్టింపు లేదు, అంటే ఐఎస్‪సి, సీబీఎస్ఈ, స్టేట్ బోర్డ్స్, ఐబి, కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ ఎ లెవల్స్, ఇతర అంతర్జాతీయ ఎగ్జామినేషన్ బోర్డ్స్ విద్యని అభ్యసించిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్ఐఎఎస్ లో కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి కనీస కటాఫ్ స్కోర్ లేదా ఎక్స్‪ట్రా -కరికులర్ ప్రతిభలు ఏవీ అవసరం లేదు. ఆశావహులని, స్కోర్ కార్డులకి మించి వారి సామర్థ్యాన్ని గుర్తించాలని క్రియా విశ్వసిస్తోంది.



Next Story