ప్రపంచ సంపన్నుల జాబితాలో నాలుగో స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ!

by Disha Web |
ప్రపంచ సంపన్నుల జాబితాలో నాలుగో స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ!
X

న్యూఢిల్లీ: దేశీయ, ఆసియా అత్యంత సంపన్నుడు గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో ఒక స్థానం కిందకు పడిపోయారు. తాజా బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో, గౌతమ్ అదానీ గత 24 గంటల వ్యవధిలో సుమారు రూ. 7 వేల కోట్ల కంటే ఎక్కువ సంపదను కోల్పోవడంతో మూడవ స్థానం నుంచి నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. దీంతో ప్రపంచ మూడో సంపన్నుడిగా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ నిలిచారు.


ఇక, భారత్‌కే చెందిన రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఈ జాబితాలో 12వ స్థానంలో ఉన్నారు. బ్లూమ్‌బర్గ్ ప్రకారం, ప్రపంచ అత్యంత సంపన్నుడిగా ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్ వ్యవస్థాపకుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్ 188 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 15.13 లక్షల కోట్లు)తో అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన తర్వాత ఎలన్ మస్క్(2), బిల్‌గేట్స్(5), వారెన్ బఫెట్(6), లారీ ఎలిసన్(7), లారీ పేజ్(8), సెర్గీ బ్రిన్(9), స్టీవ్ బామర్(10) స్థానాల్లో ఉన్నారు.


Next Story