మార్చిలో దాదాపు రూ. 8 వేల కోట్లు విలువైన షేర్లు కొన్న విదేశీ మదుపర్లు!

by Dishanational1 |
మార్చిలో దాదాపు రూ. 8 వేల కోట్లు విలువైన షేర్లు కొన్న విదేశీ మదుపర్లు!
X

ముంబై: ఈ ఏడాది మార్చిలో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు(ఎఫ్‌పీఐ) భారత ఈక్విటీ మార్కెట్లలో రూ. 7,936 కోట్ల పెట్టుబడులు పెట్టారు. అంతకుముందు వరుస రెండు నెలల్లో అమ్మకాలను కొనసాగించిన ఎఫ్‌పీఐలు గత నెలలో సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా అదానీ గ్రూప్ కంపెనీల్లో అమెరికాకు చెందిన జీక్యూజీ పార్ట్‌నర్స్ భారీ పెట్టుబడుదల ద్వారా ఎఫ్‌పీఐల మొత్తం పెరిగింది. జీక్యూజీ పార్ట్‌నర్స్ పెట్టుబడులను మినహాయిస్తే ఇప్పటికీ ఎఫ్‌పీఐల పెట్టుబడులు ప్రతికూలంగా ఉన్నాయని, దాన్నిబట్టి విదేశీ మదుపర్లు మార్చిలోనూ భారత మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకున్నారని జీఎల్‌సీ వెల్త్ అడ్వైజర్ ఎల్ఎల్‌పీ సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ సంచిత్ గార్గ్ అన్నారు. ఇదే సమయంలో ఎఫ్‌పీఐలు కొన్ని రంగాల్లో కొనుగోళ్లను కూడా పెంచారని, ఇది రానున్న రోజుల్లో సానుకూలంగా మారచవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి కె విజయకుమార్ చెప్పారు. ఇటీవల భారత మార్కెట్లలో నెలకొన్న ఒత్తిడి కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడికి దీన్ని అవకాశంగా చూడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం, గత నెలలో భారత ఈక్విటీల్లో ఎఫ్‌పీఐలు రూ. 7,936 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. డెట్ మార్కెట్ల నుంచి రూ. 2,505 కోట్ల విలువైన నిధులను వెనక్కి తీసుకెళ్లారు.

Next Story

Most Viewed