ఏబీజీ షిప్‌యార్డ్‌ కేసులో దూకుడుగా ఈడీ.. భారీ మొత్తంలో ఆస్తుల అటాచ్

by Disha WebDesk |
ఏబీజీ షిప్‌యార్డ్‌ కేసులో దూకుడుగా ఈడీ.. భారీ మొత్తంలో ఆస్తుల అటాచ్
X

న్యూఢిల్లీ: బ్యాంకులను వేల కోట్లు మోసం చేసిన ఏబీజీ షిప్‌యార్డ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం రూ. 2,747.69 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్టు వెల్లడించింది. అటాచ్ చేసిన ఆస్తులలో సూరత్, దహేజ్‌లలోని షిప్‌యార్డ్‌లు, వ్యవసాయ భూములు, ప్లాట్లు ఉన్నాయి. అలాగే, గుజరాత్, మహారాష్ట్రలలోని వివిధ వాణిజ్య, నివాస స్థలాలు, ఏబీజీ షిప్‌యార్డ్, దాని గ్రూప్ కంపెనీలు, ఇతర సంబంధిత సంస్థలకు చెందిన బ్యాంకు ఖాతాలు ఉన్నాయి.

మనీలాండరింగ్ చట్టం-2022 కింద ఏజీబీ షిప్‌యార్డ్, దాని గ్రూప్ కంపెనీలు, బెర్మాకో ఎనర్జీ సిస్టమ్స్, ధనంజయ్ దాతర్, సవితా ధనంజయ్ దాతర్, కృష్ణ గోపాల్, వీరెన్ అహుజాకు చెందిన మొత్తం రూ. 2,747.69 కోట్ల స్థిర చరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇదే కేసులో బుధవారం ఏబీజీ షిప్‌యార్డ్ వ్యవస్థాపక ఛైర్మన్ రిషి అగర్వాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

షిప్పుల తయారీ, రిపేర్‌ వ్యవహారాలను నిర్వహించే గుజరాత్‌కు చెందిన ఏబీజీ షిప్‌యార్డ్‌ కంపెనీ ఐసీఐసీఐ బ్యాంక్‌ నేతృత్వంలోని 28 బ్యాంకులను రూ. 22,842 కోట్లకు పైగా మోసగించింది. ఇందులో ఐసీఐసీఐ బ్యాంక్‌ వాటా రూ. 7,089 కోట్లు, ఎస్‌బీఐ వాటా రూ. 2,468.51 కోట్లు. 2016లో ఈ కంపెనీ రుణ ఖాతాను ఎన్‌పీఏగా, 2019లో మోసపూరిత ఖాతాగా గుర్తించారు.

Telugu News , Latest Telugu News. Telangana News. Political News. Cinema News. Crime News. AP News. Web Stories. Latest Photo Galleries

Next Story

Most Viewed