పదేళ్లకు ఒకసారి Aadhaar అప్‌డేట్ తప్పనిసరి!

by Disha Web Desk 21 |
పదేళ్లకు ఒకసారి Aadhaar అప్‌డేట్ తప్పనిసరి!
X

న్యూఢిల్లీ: ప్రభుత్వం ఆధార్ కార్డు నిబంధనలను సవరించింది. ప్రస్తుతం దేశంలో సుమారు 134 కోట్ల ఆధార్ కార్డులు జారీ అయ్యాయి. వీటిలో కొన్నింటికి సంబంధించిన వివరాలు సరిగా లేవని, దీన్ని దృష్టిలో ఉంచుకుని నిబంధలను మార్చాలని గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం, దేశంలోని ప్రతి వ్యక్తి 10 సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా ఆధార్ కార్డు వివరాలను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే, ఆధార్ కార్డు తీసుకున్న ప్రతి పదేళ్లకు కనీసం ఒక్కసారైనా వ్యక్తిగత వివరాల ధృవీకరణ డాక్యుమెంట్లను ఇవ్వాలి.

అందులో వ్యక్తిగత దృవీకరణ, ఇంటి అడ్రస్ డాక్యుమెంట్లు ఉండాలని, దీనివల్ల సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపోజిటరీ(సీఐడీఆర్)లో డేటా అందుబాటులో ఉంటాయని కేంద్ర ఐటీ శాఖ తెలిపింది. గత నెలలో ప్రభుత్వం ఆధార్ ధృవీకరణ డాక్యుమెంట్లకు సంబంధించిన అప్‌డేట్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని ఉపయోగించి యూజర్లు తమ వ్యక్తిగత వివరాలకు చెందిన సమాచారన్ని, సంబంధిత డాక్యుమెంట్లను అప్‌డేట్ చేసుకునే వీలుంది.


Next Story

Most Viewed