- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ఏటా రూ.10 కోట్లకు పైగా సంపాదిస్తున్న వారు 31 వేల మందికి పైనే
దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న తరుణంలో దేశీయంగా ప్రజల సంపాదన కూడా క్రమంగా పెరుగుతుంది. తాజాగా సెంట్రమ్ ఇన్‌స్టిట్యూషనల్ రీసెర్చ్ నుంచి వచ్చిన ఒక నివేదిక ప్రకారం, 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఏటా రూ.10 కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్న భారతీయుల సంఖ్య గత ఐదేళ్లలో 63 శాతం పెరిగింది. దాదాపు దేశంలో ఇప్పుడు 31,800 మంది వ్యక్తులు ఏటా రూ.10 కోట్లకు పైగా సంపాదిస్తున్నారు. అలాగే, ఏటా రూ.5 కోట్లకు పైగా సంపాదిస్తున్న భారతీయులు కూడా 49 శాతం వృద్ధితో 58,200 మంది వ్యక్తులకు చేరుకున్నారని నివేదిక పేర్కొంది.
సంవత్సరానికి రూ.50 లక్షలకు పైగా సంపాదించే వారి సంఖ్య 25 శాతం పెరిగి దాదాపు 10 లక్షల మంది వ్యక్తులకు చేరుకుంది. ముఖ్యంగా ధనవంతుల సంపద వేగంగా పెరుగుతున్నట్లు నివేదిక హైలెట్ చేసింది. రూ.10 కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్న వారి మొత్తం ఆదాయం 2019-24 మధ్య 121 శాతం వార్షిక వృద్ధి రేటుతో రూ. 38 లక్షల కోట్లకు చేరుకుంది. అదే విధంగా, రూ. 5 కోట్లకు పైగా సంపాదించే వ్యక్తుల ఆదాయం 106 శాతంతో రూ. 40 లక్షల కోట్లకు చేరింది. ఏడాదికి రూ. 50 లక్షలకు పైగా సంపాదిస్తున్న వారి ఆదాయం 64 శాతం పెరిగి, గత ఐదేళ్లలో మొత్తం రూ.49 లక్షల కోట్లకు చేరుకుంది.