- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
ఆల్ట్‌మాన్ తొలగింపుతో OpenAIకి కొత్త తలనొప్పి.. Microsoftలోకి 500 మంది జంప్!

దిశ, వెబ్‌డెస్క్: OpenAIకి చెందిన ChatGPT సృష్టికర్త సామ్ ఆల్ట్‌మాన్‌నును కంపెనీ సీఈఓగా బాధ్యతల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. అయితే ఆయన Microsoftలో చేరనున్నట్లు ఇటీవల పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఆల్డ్‌మాన్‌ను తన కంపెనీలోకి ఆహ్వనించారు. Microsoftలో AI ను వృద్ధి చేయడానికి తనవంతు సహాకరం అందిస్తానని ఆల్డ్‌మాన్ తెలిపాడు. ఆయనతో పాటు OpenAI సహ-వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రాక్‌మాన్ సైతం Microsoftలో AI బృందంలో చేరనున్నారు.
అయితే ఆల్ట్‌మాన్ తొలగింపు పట్ల OpenAI ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయనను తిరిగి తీసుకురాకపోతే ఉద్యోగాలకు రాజీనామా చేస్తామని బెదిరిస్తూ కంపెనీకి లేఖ రాశారు. OpenAIలో దాదాపు 770 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 500 మంది ఉద్యోగులు రాజీనామా చేసి మైక్రోసాఫ్ట్‌లో చేరతామని, అక్కడ తమకు మంచి ప్యాకేజీతో కూడిన సమూచిత స్థానం కల్పిస్తామని మైక్రోసాఫ్ట్ మాకు హామీ ఇచ్చిందని OpenAI బోర్డుకు ఇటీవల లేఖ రాశారు.
ఆల్ట్‌మన్‌ను కంపెనీ నుంచి తొలగించడం వలన చాలా మంది ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుత బోర్డు సభ్యులందరూ రాజీనామా చేసి, బ్రెట్ టేలర్, విల్ హర్డ్ వంటి ఇద్దరు కొత్త ప్రధాన స్వతంత్ర డైరెక్టర్లను బోర్డు నియమించి, సామ్ ఆల్ట్‌మన్, గ్రెగ్ బ్రాక్‌మన్‌లను తిరిగి నియమించాలని ఉద్యోగులు బోర్డుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.