PMJDY : మీకు జన్-ధన్ యోజన ఖాతా ఉందా.. అయితే రూ. 10,000 మీవే!

by Disha Web Desk 17 |
PMJDY : మీకు జన్-ధన్ యోజన ఖాతా ఉందా.. అయితే రూ. 10,000 మీవే!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ ఉండాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం 'ప్రధాన మంత్రి జన్-ధన్ యోజనను' 2014 లో ప్రవేశపెట్టింది. దీని ద్వారా చాలా మంది బ్యాంకు అకౌంట్ లేని పేద, మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు ఎలాంటి డబ్బులు చెల్లించకుండా వివిధ బ్యాంకులలో అకౌంట్‌‌లు ఓపెన్ చేశారు.

ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్, చెల్లింపులు, క్రెడిట్, బీమా, ప్రభుత్వ పెన్షన్‌ల వంటి ఆర్థిక సేవలను డైరెక్ట్‌గా ప్రజలకు అందించడానికి ఈ పథకం బాగా ఉపయోగపడుతుందని ప్రభుత్వ అభిప్రాయం. ఈ అకౌంట్‌లో ప్రతినెల రూ. 10,000 కు మించి ఎక్కువ అమౌంట్ డిపాజిట్ చేయరాదు. అకౌంట్‌లో డబ్బులు లేకున్నా కూడా ఎలాంటి ఛార్జీలు విధించరు. ఇది జీరో బ్యాలెన్స్ ఖాతా.

జన్-ధన్ యోజన ఖాతా కలిగి ఉన్న వినియోగదారులకు ప్రభుత్వ వివిధ రకాల ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇన్సూరెన్స్, ఓవర్‌డ్రాఫ్ట్ (OD) మొదలగు వాటిని ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది.

కనీసం ఆరు నెలల పాటు ఖాతా నుంచి ట్రాన్సక్షన్స్ చేసినట్లయితే రూ.10,000 వరకు ఓవర్‌డ్రాఫ్ట్ పొందవచ్చు. సాధారణంగా కూడా రూ. 2,000 వరకు లోన్ తీసుకునే ఆప్షన్ అందుబాటులో ఉంది. కొన్ని పరిస్థితులలో లోన్ పరిమితి రూ. 5,000 వరకు కూడా ఉంటుంది.

Read more :

1.మీకు ఆదాయం లేదా.. అయితే ఈ విధంగా కూడా Credit Cards పొందవచ్చు



Next Story

Most Viewed