నాన్-టెక్ ఉద్యోగులకు భారీ గిరాకీ!

by Dishanational4 |
నాన్-టెక్ ఉద్యోగులకు భారీ గిరాకీ!
X

న్యూఢిల్లీ: ఇటీవల టెక్ రంగంలో భారీ ఉద్యోగాల తొలగింపుల జరుగుతున్న నేపథ్యంలో నాన్-టెక్ రంగాల్లోని నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు గిరాకీ పెరిగిందని ఓ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా హెల్త్‌కేర్, ఫుడ్ సర్వీసెస్, నిర్మాణ, విద్యా రంగాల్లో ప్రతిభావంతులకు అధిక డిమాండ్ ఉంది. 2022, డిసెంబర్ నెలకు సంబంధించి ప్రముఖ గ్లోబల్ జాబ్‌సైట్ ఇండీడ్ రూపొందించిన నివేదిక ప్రకారం.. అత్యధికంగా హెల్త్‌కేర్ రంగంలోని డెంటల్, నర్సింగ్ ఉద్యోగాలు 30.8 శాతం నియామకాలు జరిగాయి. దీని తర్వాత ఫుడ్ సర్వీసెస్(8.8 శాతం), నిర్మాణాలు(8.3 శాతం), ఆర్కిటెక్చర్(7.2 శాతం), విద్య(7.1 శాతం), థెరపీ(6.3 శాతం), మార్కెటింగ్(6.1 శాతం) నియామకాలు జరిగాయని నివేదిక పేర్కొంది.

కరోనా మహమ్మారి అనంతర పరిణామాల కారణంగా నిర్మాణ, సివిల్ ఇంజనీరింగ్ వంటి రంగాల్లో ఉత్సాహం పెరిగిందని నివేదిక అభిప్రాయపడింది. అలాగే, కరోనా సమయంలో ఎక్కువ తొలగింపులు చేపట్టిన మార్కెటింగ్ వంటి రంగాలు ఇప్పుడు మెరుగైన వినియోగదారు సేవలు, వ్యాపారం, విక్రయాల కార్యకలాపాల అవసరాన్ని గుర్తించి నియామకాలు పెంచాయని ఇండీడ్ వివరించింది. నియామకాల్లో బెంగళూరు నగరం 16,5 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత ముంబై 8.23 శాతం, పూణె 6.33 శాతం, చెన్నై 6.1 శాతం నియామకాలను నమోదు చేశాయి.



Next Story

Most Viewed