భలే దొంగలు… బ‌స్‌స్టాప్‌నే కొట్టేశారు!!

by  |
భలే దొంగలు… బ‌స్‌స్టాప్‌నే కొట్టేశారు!!
X

దిశ, వెబ్ డెస్క్: ఇది మామూలు వార్త కాదు… భలే వార్త… భలే దొంగల వార్త..! సామాన్యులకే కాదు సాటి దొంగలకు కూడా ఆశ్చర్యం కలిగించే వార్త. నగదు, బంగారం, వెండి, బైకులు, వాహనాలు కొట్టేసిన వార్తలు చాలానే విని ఉంటాం. కానీ ఇది కనీవినీ ఎరగని దొంగతనం. అందరు చేసే దొంగతనాలే చేస్తే కిక్ ఏముంటది. ఏదైనా వెరైటీ దొంగతనం చేస్తే డబ్బుకి డబ్బు, పబ్లిసిటీకి పబ్లిసిటీ వస్తాయి అనుకున్నారు కాబోలు… ఏకంగా బస్టాప్ నే చోరీ చేసేశారు. ఆ కథాకమామిషీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మహారాష్ట్రలోని పూణెలోని దేవకి ప్యాలెస్ ఎదుట పూణె నగర పాలక సంస్థ ఓ బస్‌స్టాప్‌ను ఏర్పాటు చేసింది. సడెన్ గా అది మాయమైంది. రాత్రంతా ఉన్న బస్‌స్టాప్ తెల్లారేసరికి మాయం అవడంతో అధికారులే తొలగించి, ఏమైనా రిపేర్ వంటివి చేసి మళ్లీ అమర్చుతారేమో అనుకున్నారు స్థానికులు. తర్వాత అసలు విషయం తెలిసి ఖంగుతిన్నారు. దొంగలు బస్టాప్ కింది నుంచి బోల్టులు లూజ్ చేసి ఎత్తుకెళ్లారు. పానాలు, కటింగ్ ప్లేర్లు, సుత్తెలు వంటి ఆయుధాలతో వచ్చి బస్‌స్టాప్‌ను దర్జాగా దొంగిలించుకెళ్ళారు.

చోరీ విషయం తెలుసుకున్న స్థానిక నేత, ఎన్సీపీకి చెందిన మాజీ కార్పొరేటర్ ప్రశాంత్ షాక్ అయ్యారు. షాక్ నుండి తేరుకుని బస్‌స్టాప్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నిందితుల వివరాలు చెప్పిన వారికి రూ.5 వేల బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వెరైటీ దొంగతనంపై క్రియేటివ్ నెటిజెన్స్ ఫన్నీ ట్వీట్స్ అండ్ మీమ్స్ పెట్టి నవ్వులు పూయిస్తున్నారు. దీంతో ఈ దొంగతనం స్టోరీ నెట్టింట్లో భలే సందడి చేస్తోంది.

Next Story

Most Viewed