భూపతిరావుకు రాష్ట్ర స్థాయి ప్రతిభారత్న అవార్డు

336

దిశ, భద్రాచలం టౌన్ : సమాజసేవా తత్పరుడు, గ్రీన్ భద్రాద్రి గౌరవ అధ్యక్షులు గోళ్ళ భూపతిరావుకు రాష్ట్ర స్థాయి ప్రతిభా రత్న అవార్డు దక్కింది. వైజా‌గ్‌కు చెందిన అఖిల భారత సాంస్కృతిక సమాఖ్య వారు ఈ అవార్డును ప్రదానం చేశారు. వైజాగ్‌లోని మద్దెలపాలంలో గల కళాభారతి ఆడిటోరియంలో సంస్థ కన్వీనర్ డాక్టర్ గనగళ్ళ విజయకుమార్, వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు.

స్వతహాగ మొక్కల ప్రేమికుడైన భూపతిరావు.. ఉద్యానవన శాఖ అధికారిగా పనిచేసిన కాలంలో ఐటీడీఏలో లక్షల మొక్కలు గిరిజనులతో నాటించి వాటి పోషణ బాధ్యత, సక్రమ నిర్వహణ చేయించిన ఘనత ఆయనకు ఉంది. 25 ఏండ్ల తన ఐటీడీఏ సర్వీసులో 8 అవార్డులను పొందారు. పదవీ విరమణ తర్వాత గ్రీన్ భద్రాద్రి సంస్థలో చురుకైన పాత్ర పోషిస్తూ, కొన్నివేల మొక్కలను భద్రాచలంలో నాటించి వాటిని సంరక్షిస్తూ పట్టణ ప్రజల ప్రశంసలను అందుకొంటున్నారు.