మార్కెట్‌లో లాభాల జోరు

by  |
మార్కెట్‌లో లాభాల జోరు
X

ముంబయి: దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో సూచీలు లాభాల పట్టాయి. అమెరికా మరో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల నుంచి గట్టేక్కిస్తుందని భావనతో మదుపర్ల సెంటిమెంట్ బలపడింది. మంగళవారం ఉదయం నుంచే షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. ఇంట్రడే బీఎస్ఈ సెన్సెక్స్ 620 పాయింట్లు, నిఫ్టి50 సూచీ అత్యధికంగా 11,318 మార్కును దాటింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 558 పాయింట్లు లేదా 1.47 శాతం లాభపడి 38,942.95 పాయింట్లు, నిఫ్టి50 169 పాయింట్లు లేదా 1.5శాతం పెరిగి 11,300.55 వద్ద ముగిసింది. జూన్ 30తో ముగిసిన తొలి త్రైమాసికంలో కంపెనీలు అంచనాలకు మించి లాభాలను ఆర్జించడం, నగదు లభ్యత పెరగడం మార్కెట్ బలపడటానికి కారణమైందని విశ్లేషకులు తెలిపారు.

బీఎస్ఈ సెన్సెక్స్‌లోని 19 రంగాల్లో కొనుగోళ్ల జోరు కనిపించింది. అత్యధికంగా ఆటోమొబైల్ రంగం సూచీలు 3శాతం లాభ పడ్డాయి. బ్యాంకింగ్. ఐటీ, మెటల్, ఫైనాన్షియల్ సేవలు, రియాల్టీ సూచీలు 1శాతానికిపైగా లబ్ధి పొందిన వాటిలో ఉన్నాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ 0.9శాతం, బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ సూచీ 1.3శాతం ఎగబాకాయి.

ఎన్‌ఎస్ఈ నిఫ్టిలో అల్ట్రాటెక్ సిమెంట్ సూచీలు అత్యధికంగా లబ్ధి పొందాయి. జూన్ 30తో ముగిసిన మొదటి త్రైమాసికంలో రూ.797.43కోట్ల నికర లాభం ఆర్జించినట్లు ప్రకటించడంతో అల్ట్రాటెక్ సూచీలు 7శాతానికి పైగా పెరిగి రూ.4,131 వద్ద ముగిసింది. కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా మోటార్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హిందల్కో, టీసీఎస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, శ్రీ సిమెంట్ సూచీలు కూడా 4నుంచి 5శాతం మధ్యలో లాభ పడ్డాయి. మరోవైపు భారతి ఇన్‌ఫ్రాటెల్, ఐసీఐసీ బ్యాంక్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, ఓఎన్‌జీసీ, నెస్లే, ఏసియన్ పెయింట్స్, ఇండియన్ ఆయిల్ సూచీలు నష్టపోయిన వాటిలో ఉన్నాయి.

Next Story

Most Viewed