‘బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్’.. ఇంటెన్స్‌గా సిద్ధార్థ్ ఫస్ట్ లుక్

80

దిశ, సినిమా : ‘బ్రోకెన్ బట్ బ్యూటీఫుల్’ సీజన్ 3 మే 29 నుంచి ఎంఎక్స్‌ ప్లేయర్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో మేకర్స్ హీరో సిద్ధార్థ్ శుక్లా ఫస్ట్‌ ‌లుక్ రివీల్ చేశారు. హ్యాండ్సమ్ హంక్ సిద్ధార్థ్‌ను అగస్త్యా రావ్‌గా పరిచయం చేస్తూ షేర్ చేసిన పిక్ ఇంటెన్స్‌గా ఉండగా.. ఇందులో థియేటర్ డైరెక్టర్‌గా కనిపించబోతున్నాడు. బిగ్ బాస్ సీజన్ 13తో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న సిద్ధార్థ్‌కు ఇది ఫస్ట్ వెబ్ సిరీస్ కాగా.. అభిమానుల్లో ఎగ్జైట్‌మెంట్ పెరిగిపోయింది. గతంలో సిద్ధార్థ్ శుక్లా, సోనియా రాథీల లిప్ లాక్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఈ రొమాంటిక్ వెబ్ షోలో త్రీ సాంగ్స్ ఉన్నాయని సమాచారం. అఖిల్ సచ్‌దేవా, విశాల్ మిశ్రా, అమాల్ మాలిక్ ఈ సాంగ్స్‌ను కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఏఎల్‌టీ బాలాజీ బ్యానర్‌పై ఏక్తా కపూర్ నిర్మించిన వెబ్ సిరీస్‌పై ఇప్పటికే అంచనాలు రెట్టింపు కాగా.. రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..