బ్రేకింగ్ : ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమించటం లేదని ప్రియురాలిపై దాడి

by samatah |
బ్రేకింగ్ : ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమించటం లేదని ప్రియురాలిపై దాడి
X

దిశ, వెబ్‌డెస్క్ : నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని వెంకటగిరి కాలేజీ మిట్ట ప్రాతంలో ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. ఓ అమ్మాయి తనను ప్రేమించడం లేదన్న కోపంతో ఉన్మాదిగా మారాడు. ఎంత బ్రతిమాలినా తన ప్రేమను నిరాకరిస్తోందన్న కోపంతో కత్తితో ప్రియురాలి గొంతు కోశాడు చెంచు కృష్ణ అనే యువకుడు. వివరాల్లోకి వెళ్లితే.. ఇంటర్ చదువుతొన్న బాలికను, కృష్ణ అనే యువకుడు గత కొన్ని రోజులుగా ప్రేమించమని వెంటపడుతున్నాడు. కానీ ఆ అమ్మాయి తన ప్రేమను నిరాకరిచడంతో కత్తితో దారుణంగా గొంతుకోశాడు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Next Story