వంశీరామ్ బిల్డర్స్‌పై ఐటీ ఫోకస్.. దాడుల్లో వెలుగులోకి సంచలన విషయాలు

by Disha Web Desk 2 |
వంశీరామ్ బిల్డర్స్‌పై ఐటీ ఫోకస్.. దాడుల్లో వెలుగులోకి సంచలన విషయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ నగరంలో ఐటీ అధికారులు చేస్తున్న తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ప్రముఖ వంశీరామ్ బిల్డర్ ఇళ్లు, కార్యాలయల్లో చేస్తున్న దాడుల్లో అధికారులు స్పీడ్ పెంచారు. ముఖ్యంగా వంశీరామ్ బిల్డర్ యజమాని సుబ్బారెడ్డి బావమరిది జనార్థన్ రెడ్డి ఇంట్లో జరుపుతోన్న తనిఖీల్లో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో వంశీరామ్ బిల్డర్ దాదాపు 80కి పైగా ప్రాజెక్టులు చేపట్టినట్లు సమాచారం. లగ్జరీ విల్లాలు, కమర్షియల్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు మూడు వేల గజాల్లో ఇంద్రభవనం లాంటి ఇల్లును హైదరాబాద్‌లో వంశీరామ్ బిల్డర్ యజమాని సుబ్బారెడ్డి నిర్మించుకున్నట్లు సమాచారం. అత్యుధునిక హంగులతో వందలకోట్లతో నిర్మాణం జరిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఐటీ అధికారులు సుబ్బారెడ్డి ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించారు. గత ఏడాది కాలంగా జరిపిన ట్యాక్స్ చెల్లింపుల వివరాలపై ఆరా తీస్తున్నారు. వంశీరామ్ బిల్డర్స్ చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాల్లో చాలా వరకు లొసుగులు ఉన్నట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నట్లు సమాచారం. అన్ని చోట్ల కస్టమర్ల వద్ద నుంచి 50 శాతం బ్లాక్ మనీ వసూలు చేసినట్లు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి : వల్లభనేని వంశీతో పాటు అధికార పార్టీ నేతల ఇళ్లలో ఐటీ దాడులు

Next Story