వాట్సాప్ లో గ్యాస్ బుకింగ్ ఇలా

by  |
వాట్సాప్ లో గ్యాస్ బుకింగ్ ఇలా
X

దిశ, వెబ్ డెస్క్: సిలిండర్ బుక్ చేయాలంటే.. గ్యాస్ ఏజెన్సీ దగ్గరకు వెళ్లడం కానీ లేదా… ఫోన్ ద్వారా కూడా బుక్ చేసుకుంటుంటాం. ఇప్పుడు టెక్నాలజీ తెచ్చిన మార్పులతో అందరూ చాలా అప్డేట్ అవుతున్నారు. అందువల్లే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) కూడా సరికొత్తగా ఆలోచించి.. వాట్సాప్ లోనూ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే సదుపాయాన్ని కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

బీపీసీఎల్ కంపెనీ వెబ్ సైట్ లో రిజిష్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ నుంచి వాట్సాప్ నెంబర్ ‘1800 224 344’ ద్వారా సిలిండర్ బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. కస్టమర్లకు మరింత ఈజీగా గ్యాస్ బుకింగ్ సేవలు కల్పించాలనే ఉద్దేశంతోనే వాట్సాప్ బుకింగ్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్ అరుణ్ సింగ్ వెల్లడించారు. సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత మొబైల్ ఓ లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసి.. డెబిట్ , క్రెడిట్ కార్డులు, లేదా యూపీఐ, అమెజాన్ ద్వారా పేమెంట్ చేయొచ్చు.



Next Story

Most Viewed