శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో బాంబ్.. పరుగులు తీసిన సిబ్బంది

by  |
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో బాంబ్.. పరుగులు తీసిన సిబ్బంది
X

దిశ, వెబ్‌డెస్క్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో బాంబ్ బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. ఇంటర్నేషనల్ ప్రయాణికులు ప్రయాణాలు సాగించే ఈ ఎయిర్ పోర్టుకు నిత్యం కట్టుదిట్టమైన బందోబస్త్ ఉంటుంది. అయినా బాంబ్ పెట్టామని ఫోన్ కాల్ రావడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం..

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లోని డిక్యాతలాన్ స్పోర్ట్స్ స్టోర్ రూమ్‌లో బాంబ్ పెట్టామని, కోటి రూపాయలు ఇవ్వకపోతే రిమోట్ సాయంతో స్టోర్‌ను పేల్చేస్తామని గుర్తు తెలియని వ్యక్తి స్టోర్‌కు ఫోన్ చేశాడు. భయాందోళన చెందిన సిబ్బంది స్టోర్ నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఎయిర్ పోర్ట్ అధికారులు, భద్రతా సిబ్బంది స్టోర్ రూం నుంచి అందరిని బయటకు పంపించి తనిఖీ చేపట్టారు. బాంబ్ స్క్వాడ్ టీం క్షుణ్ణంగా పరిశీలించి బాంబ్ లేదని నిర్ధారించారు.

దీనిపై కేసు నమోదు చేసిన ఎయిర్ పోర్ట్ పోలీసులు ఫేక్ కాల్‌గా తేల్చేశారు. స్పోర్ట్స్ స్టోర్‌కు వచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడే బెదిరింపు కాల్ చేసినట్టు సమాచారం. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువకుడు ఒక్కడే కాల్ చేశాడా..? ఇంకా ఎవరన్న ఉన్నారా..? దేనికోసం చేశారు.. ఉగ్రమూలాలు ఏమన్న ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed