బాలీవుడ్ Vs పబ్లిక్.. #Bollywooddirt

by  |
బాలీవుడ్ Vs పబ్లిక్.. #Bollywooddirt
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ అసోసియేషన్స్, నిర్మాణ సంస్థలు.. మీడియాపై ఢిల్లీ హైకోర్టులో సూట్ వేయడంపై సామాన్య జనం మండిపడుతున్నారు. తమ పరువుకు భంగం కలిగించేలా న్యూస్ ప్రసారం చేస్తున్నారని.. డ్రగిస్ట్, డర్ట్ పదాలు వాడుతున్నారని వారు తమ సూట్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ విషయంపై ‘చేస్తే తప్పు లేదు కానీ అంటేనే తప్పొచ్చిందా’ అంటూ మండిపడుతున్న నెటిజన్లు.. #Bollywooddirt పేరుతో హాష్ ట్యాగ్‌ను ట్రెండింగ్‌లో ఉంచారు.

అసలు ఇన్నాళ్ల బాలీవుడ్ చరిత్రలో ఎప్పుడూ కూడా కలిసిరాని వాళ్లు, ఇప్పుడెందుకు మూకుమ్మడిగా ముందుకొచ్చారని ప్రశ్నిస్తున్నారు. కాస్టింగ్ కౌచ్ విషయంలో మాట్లాడని బాలీవుడ్.. ఇండస్ట్రీపై టెర్రరిజం ప్రభావం పడుతున్నప్పుడు స్పందించని యాక్టర్స్, ఫిల్మ్ మేకర్స్.. తమ మీద వచ్చే రూమర్స్, స్కూప్స్ వల్ల యంగ్ యాక్టర్స్ మెంటల్‌గా అప్‌సెట్ అయినా కూడా నోరువిప్పని సీనియర్స్.. ఇప్పుడు కలిసి వచ్చి నిజంగానే ‘డర్టీ బాలీవుడ్’ అనిపించుకున్నారని మండిపడ్డారు. సుశాంత్ చనిపోతే, కనీసం తనకు న్యాయం జరగాలని కూడా బాలీవుడ్ కోరుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయినా నిజంగా బాలీవుడ్ యాక్టర్స్, ఫిల్మ్ మేకర్స్ డ్రగ్స్‌కు బానిస కాకపోతే, ఎందుకు నిరూపించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇలా మీడియాపై కేసు పెట్టి బాలీవుడ్ రియల్ ఫేస్ చూపించిందని.. నిజాలను ప్రసారం చేస్తున్నందుకు ఇలా చేయడం బాలీవుడ్‌కు మాత్రమే చెల్లుతుందని ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. ఇది పబ్లిక్ వెర్సెస్ బాలీవుడ్ మ్యాటర్ అని, బాలీవుడ్‌ను బాయ్‌కాట్ చేయాలని కోరుతున్నారు. వాళ్లు తీసే చెత్త సినిమాలు.. మనకేమీ జ్ఞానాన్ని సంపాదించింది పెట్టడం లేదని, వల్గారిటీతో కూడిన సినిమాలు చూసి ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయకూడదని చెప్తున్నారు. రిపబ్లిక్ టీవీ అర్ణబ్ గోస్వామి, ప్రదీప్ భండారి, టైమ్స్ నౌ నవిక కుమార్, రాహుల్ శివ్‌శంకర్‌లకు సపోర్ట్ చేస్తున్నారు.

రామ్‌గోపాల్ వర్మ దీనిపై స్పందిస్తూ.. బాలీవుడ్ రియాక్షన్ చాలా లేట్ అయిందన్నాడు. బాలీవుడ్ మీడియాపై కోర్టులో కేసు ఫైల్ చేయడం.. టీచర్ టీచర్ అని ఆర్ణబ్‌పై కంప్లెయింట్ చేసినట్లుగా ఉందని కామెంట్ చేశాడు.



Next Story

Most Viewed