బోట్ నుంచి తొలి స్మార్ట్ బ్యాండ్

by  |
బోట్ నుంచి తొలి స్మార్ట్ బ్యాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆడియో ప్రొడ‌క్ట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ బోట్.. తొలి ‘వేరబుల్ ప్రొడక్ట్స్’ను లాంచ్ చేస్తూ.. మరో ముందడుగు వేసింది. ఇండియాలో ‘ప్రొగేర్ బి20’ పేరుతో ఓ నూత‌న స్మార్ట్‌బ్యాండ్‌ను విడుద‌ల చేసింది. 14 ర‌కాల వ‌ర్క‌వుట్ మోడ్స్‌తో ఈ ప్రొడక్ట్ అందుబాటులోకి రానుంది. మూడు రంగుల్లో లభ్యమవుతున్న ఈ బ్యాండ్.. వాటర్ రెసిస్టెంట్ కూడా. స్టాండ్ బై టైమ్ 10 నుంచి 15 రోజుల వరకు ఉంటుందని కంపెనీ వెల్లడిస్తుంది.

ప్రొగేర్ బి20 ఫీచర్స్..
0.96 ఇంచుల ఎల్‌సీడీ క‌ల‌ర్ ట‌చ్ డిస్‌ప్లే కలిగివున్న ఈ బ్యాండ్‌లో ఆటోమేటిక్ స్లీప్ మానిట‌రింగ్‌ను అందిస్తున్నారు. 24 గంట‌లు నిరంత‌రాయంగా హాట్‌రేట్‌ను ట్రాక్ చేసే సెన్సార్‌ను ఇందులో ఏర్పాటు చేశారు. యాక్టివిటీ ట్రాకింగ్‌తో పాటు ఫోన్లు వచ్చే.. నోటిఫికేషన్స్, అలర్ట్స్ కూడా ఇందులో ఎప్పటికప్పుడు వస్తుండటం దీని ప్రత్యేకత. 90 ఎంఏహెచ్ బ్యాట‌రీ గల ఈ స్మార్ట్‌ బ్యాండ్‌ను ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ డివైస్‌ల‌కు క‌నెక్ట్ చేసుకోవడంతో పాటు యూఎస్‌బీ క‌నెక్ట‌ర్ ద్వారా చార్జింగ్ చేసుకోవ‌చ్చు. గైడెడె మెడిటేటివ్ బ్రీతింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉండటం విశేషం. ఫోన్ కెమెరాను, మ్యూజిక్ ప్లేయర్‌ను బ్యాండ్‌తో కంట్రోల్ చేయవచ్చు. బ్లాక్‌, బ్లూ, బీజ్ రంగుల్లో విడుద‌లైన ఈ స్మార్ట్ బ్యాండ్ ధరను కంపెనీ రూ.1799/-గా నిర్ణయించింది. ఈ ప్రొడక్ట్.. ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. .

Next Story

Most Viewed