నిజామాబాద్: బ్లాక్‌ ఫంగస్‌ ట్రీట్మెంట్‌ కోసం స్పెషల్ వార్డు

by  |
Nizamabad Hospital
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణలో బ్లాక్‌ ఫంగస్ చాప కింద నీరులా విస్తరిస్తున్న వేళ వైద్యాధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో బుధవారం బ్లాక్ ఫంగస్ వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. జీజీహెచ్‌లో ఇప్పటికే మూడు వార్డుల్లో కరోనా చికిత్స కోసం వినియోగిస్తుండగా బుధవారం నుంచి 5వ అంతస్థులోని 50 పడకల్లో బ్లాక్ ఫంగస్‌కు ట్రీట్మెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో కేవలం ప్రాథమికంగా బ్లాక్ ఫంగస్‌కు చికిత్స అందించనున్నారు. సీరియస్ కేసులను మాత్రం సికింద్రాబాద్ గాంధీ, కోఠి ఈఎన్టీకి రిఫర్ చేయనున్నారు. ఇది ఇలా ఉంటే జిల్లాలో అధికారికంగా 23 బ్లాక్ ఫంగస్ కేసులు ఉండగా, మరో ఐదుగురు ఇదే ఇన్ఫెక్షన్‌ సోకి చికిత్స పొందుతూ మరణించారు.



Next Story

Most Viewed