ఇమ్యూనిటీ లేని వారిలోనే బ్లాక్ ఫంగస్.. డీఎంఈ కీలక వ్యాఖ్యలు

by  |
ఇమ్యూనిటీ లేని వారిలోనే బ్లాక్ ఫంగస్.. డీఎంఈ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇమ్యూనిటీ తక్కువగా ఉండి షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నవారికి బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకుతుందని డీఎంఈ రమేష్ రెడ్డి ప్రకటించారు. బ్లాక్ ఫంగస్ సోకిన పేషెంట్లు తుమ్మినప్పుడు, దగ్గునప్పుడు గాలిలోకి ఫంగస్ చేరుతుందన్నారు. సమీపంలో ఉన్న షుగర్ పేషంట్లకు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారికి గాలి ద్వారా బ్లాక్ ఫంగస్ వ్యాధి వ్యాపిస్తుందన్నారు. కాబట్టి కోవిడ్ నుంచి కోలుకున్న వారు తప్పనిసరిగా ఇంట్లో ఉన్నా కూడా మాస్క్ ధరించాలని సూచించారు.

కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిలో 50 మంది, ప్రైవేటు ఆసుపత్రుల్లో 30 మంది బ్లాక్ ఫంగస్కు‌ చికిత్సలు పొందుతున్నారని చెప్పారు. బ్లాక్ ఫంగస్‌కు అందించే మందుల కొరత ఉన్నందన ఇందుకు ప్రత్యామ్నయ మందులను వినియోగించాలని డాక్టర్లకు సూచించారు. కోవిడ్ రోగులకు స్టెరయిడ్స్ ఇవ్వడం వలనే బ్లాక్ ఫంగస్ వ్యాధి ఉత్పన్నమవుతుందన్నారు.

కరోనా పేషెంట్లకు వినియోగించాల్సిన మందులను సూచించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. నిపుణుల ద్వారా ఏర్పాటు చేసిన ఈ కమిటీ మందుల ప్రియారిటీని, వినియోగించాల్సిన విధానాలను వెల్లడిస్తుందన్నారు. బ్లాక్ ఫంగస్ కేసులు అధికంగా ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాలో ఈఎన్‌టీ ఆసుపత్రుల్లో చికిత్సలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు.

Next Story

Most Viewed