మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలో బ్లాక్ ఫంగస్.. నలుగురు మృతి

by  |
black fungus
X

దిశ, తెలంగాణ బ్యూరో: బ్లాక్ పంగస్ కేసులు మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలో తొలిసారిగా బయటడ్డాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాలో 50 వరకు బ్లాక్ ఫంగస్ లక్షణాలున్న వారిని డాక్టర్లు గుర్తించారు. నిర్మల్ జిల్లా బైంసాలో తొలి బ్లాక్‌ ఫంగస్మ రణం నమోదవగా ఇప్పటి వరకు మొత్తం నలుగురు మృతిచెందారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారు బ్లాక్ ఫంగస్‌తో చనిపోవడంతో కరోనా పేషెంట్లలో ఆందోళన మొదలైంది. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలోనే సెకండ్ వేవ్ వ్యాప్తి చెందడం, ఇప్పుడు బ్లాక్ ఫంగస్ వ్యాప్తి చెందడం కలవరపెడుతుంది, బ్లాక్ ఫంగస్‌తో మహారాష్ట్రలో 50 మంది వరకు చనిపోయారు.

బ్లాక్ ఫంగస్‌తో నలుగురు మృతి

ప్రాణాంతక కరోనా నుంచి తప్పించుకున్న కోవిడ్ పేషెంట్లను బ్లాక్ ఫంగస్ బలిగొంటుంది. నిర్మల్ జిల్లా బైంసాలో తొలి మరణం నమోదవగా నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో రెండో మరణం చోటుచేసుకుంది. సిరిసిల్లా జిల్లా మాల్యాలలో ఒక ఉపాధ్యాయుడు, మెదక్ జిల్లా మనోరమాబాద్ మండలంలో ఒకరు మొత్తం నలుగురు బ్లాక్ ఫంగస్‌కు బలయ్యారు. చనిపోయిన వారందరూ కరోనా సెకండ్ వేవ్‌ నుంచి కోలుకున్న వారు కావడంతో కరోనా పేషెంట్లలో ఆందోళన మొదలైంది. శరీరంలోని వైరస్‌ను నియంత్రించేందుకు అధికంగా స్టెరాయిడ్లను వాడటం, ఆక్సిమీటర్లను శుభ్రం చేయకపోవడంతో బ్లాక్ ఫంగస్ సోకుతుంది. మహారాష్ట్రాలో ఇప్పటివరకు 50వ వరకు బ్లాక్‌ఫంగస్ మరణాలు నమోదయ్యాయి. బ్లాక్ ఫంగస్ వ్యాధిని నియంత్రించేందుకు వినియోగించే లైఫోజోమల్, ఆంఫోటెరిసిన్ బి మందుల కొరత ఉండటంతో ఇందుకు ప్రత్యామ్నాయగా డాక్టర్లు పోసోకోనోజాల్, ఫ్లూకనిజాల్ మందుల వినియోగించాలని ఆలోచిస్తున్నారు. బ్లాక్ ఫంగస్ సోకిన వారికి ప్రభుత్వం కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నారు. కంటి సంభందిత వ్యాధులు వచ్చిన వారికి సరోజినీ దేవి ఆసుపత్రిలో చికిత్సలు అందిస్తున్నారు.

మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలో కేసులు

మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి, ఈ నాలుగు జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు కోవిడ్ నుంచి కోలుకున్న 50 మందిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలను గుర్తించారు. కరోనా సెకండ్ వేవ్ మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన నిజామాబాద్‌లోనే తొలిసారిగా నమోదుకావడం ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కూడా ఆ జిల్లాల నుంచే నమోదుకావడం ఆందోళన కలిగిస్తుంది. నిజామాబాద్ జిల్లాకు కరోనా కేసులు అత్య ధికంగా రోజుకు 500 వరకు నమోదయ్యాయి. దీంతో కరోనా ఆంక్షలను తొలిసారిగా నిజామాబాద్ జిల్లా సరిహద్దుల్లోనే విధించారు. కరోనా సెకండ్ వేవ్‌కు సరిహద్దు జిల్లా చాలా మంది ప్రజలు గురయ్యారు. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ సోకుతుండటంతో వారందిరిలో టెన్షన్ మొదలైంది.

Next Story