బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్

by  |
బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనేక డివిజన్లలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ కొనసాగుతోంది. తొలి రౌండ్ ముగిసే సమయానికి చాలా డివిజన్లలో ఈ రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అనే తీరులో ఉత్కంఠ కొనసాగుతోంది. టీఆర్ఎస్ 14 చోట్ల, బీజేపీ పన్నెండు డివిజన్లలో ఆధిక్యంలో ఉన్నాయి. రెండు చోట్ల మజ్లిస్ ఆధిక్యంలో ఉంది.

హస్తినాపురం, సరూర్‌నగర్, ఆర్కేపురం, గడ్డి అన్నారం, చైతన్యపురి, వనస్థలిపురం, బేగంపేట్, బేగం బజార్, బోరబండ, మల్కాజిగిరి, మన్సూరాబాద్, మాదాపూర్, మల్లేపల్లి, మూసాపేట్, మెట్టుగూడ, యూసుఫ్‌గూడ, రంగారెడ్డి నగర్, మొఘల్‌పుర, రాజేంద్ర నగర్, రామాంతపూర్, రామకృష్ణాపురం, రెడ్‌హిల్స్, లలిత్‌బాగ్, లింగోజీగూడ, వెంకటాపురం, వెంకటేవ్వరకాలనీ, వెంగళరావు నగర్ తదితర డివిజన్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది.

టీఆర్ఎస్ మాత్రం రామచంద్రాపురం, పటాన్‌చెరు, చందానగర్, హఫీజ్‌పేట్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ఓల్డ్ బోయినపల్లి, బాలానగర్, చర్లపల్లి, కాప్రా, మీర్‌పేట్, శేరిలింగంపల్లి, గాజులరామారం, రంగారెడ్డి నగర్, హిమాయత్‌నగర్, ఎర్రగడ్డ, కాప్రా, కుత్బుల్లాపూర్, గచ్చిబౌలి, గన్‌ఫౌండ్రీ, గౌతమ్‌నగర్, టోలీచౌకీ, నేరెడ్‌మెట్, ఓల్డ్ మలక్‌పేట్, ఓల్డ్ బోయినపల్లి, బాలానగర్, బీఎన్ రెడ్డి నగర్, మల్లాపూర్, మియాపూర్ తదితర డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. పత్తర్ ఘట్టి, పురానాపూల్ డివిజన్లలో మజ్లిస్ ఆధిక్యంలో ఉంది.


Next Story

Most Viewed