తెలంగాణ విడిచి వెళ్లిపోతా: ఎమ్మెల్యే రాజాసింగ్

by  |
తెలంగాణ విడిచి వెళ్లిపోతా: ఎమ్మెల్యే రాజాసింగ్
X

తెలంగాణ అసెంబ్లీలో సోమవారం పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఏఏ వల్ల ఏ ఒక్క భారతీయ పౌరుడు పౌరసత్వం కోల్పోయినా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమేకాక, తెలంగాణ రాష్ట్రం విడిచి వెళ్లిపోతానని పేర్కొన్నారు. సీఏఏ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అఫ్గనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల్లో హింసను ఎదుర్కొని మన దేశంలో శరణార్థులుగా ఉంటున్న ఆయా దేశాల అల్ప సంఖ్యాకులకు లబ్ధి చేకూర్చడానికే ఈ చట్టం తెచ్చామని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారన్నారు. శరణార్థులకు భారతీయ పౌరసత్వం ఇవ్వడానికే సీఏఏ తీసుకువచ్చారని, దీనిపై పలు పార్టీలు అనవసర రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. 2011లో జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్)ను తీసుకువచ్చారని, అప్పుడు ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకించలేదన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఎన్‌పీఆర్‌ను పునరుద్ధరిస్తామంటే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

tags : Telangana assembly session, anti caa bill, speaks on, bjp mla raja singh, leave to telangana


Next Story

Most Viewed