మార్కెట్‌లో ఉరితాడుకు వేలాడుతూ బీజేపీ ఎమ్మెల్యే

by  |
మార్కెట్‌లో ఉరితాడుకు వేలాడుతూ బీజేపీ ఎమ్మెల్యే
X

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ దినాజ్‌పుర్ జిల్లాలోని ఓ మార్కెట్‌లో బీజేపీ ఎమ్మెల్యే విగతజీవై కనిపించాడు. ఓ మొబైల్ షాప్ సీలింగ్ నుంచి ఉరితాడుకు వేలాడుతూ దేబేంద్రనాథ్ రాయ్ మృతదేహం కనిపించింది. ఈ స్పాట్ తన నివాసానికి సుమారు కిలోమీటరు దూరంలో ఉన్నది. సోమవారం ఉదయం ఉత్తర దినాజ్‌పుర్ రాయిగంజ్‌లోని ఓ మొబైల్ షాపు సీలింగ్‌కు వేసుకున్న ఉరితాడుకు ఆయన శవమై కనిపించారని, అతని జేబులో సూసైడ్ నోట్ ఉన్నదని పశ్చిమ బెంగాల్ పోలీసులు వెల్లడించారు. అతని చావుకు ఇద్దరు వ్యక్తులు కారణమన్నట్టుగా ఆ నోట్ పేర్కొందని తెలిపారు. కాగా, రాయ్‌ను అర్థరాత్రి కొంతమంది ఇంటికి వచ్చి తీసుకెళ్లారని, వారే చంపేసి ఉండొచ్చని ఆరోపించారు. ఆయన మరణంపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ కూడా రాయ్‌ది ఆత్మహత్య కాదు, హత్యేనని ఆరోపిస్తున్నది. హెమతాబాద్ ఎమ్మెల్యే రాయ్ హత్య బెంగాల్‌లోని మమతా సర్కారు గుండాగిరిని వెల్లడిస్తున్నదని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఖండించారు. రాయ్‌ది హత్యా, ఆత్మహత్యా పోలీసులు దర్యాప్తు చేసి తెలుపుతారని, దీనిపై వ్యాఖ్యానించుకోదలచలేదని సీనియర్ తృణమూల్ కాంగ్రెస్ నేత కనయలాల్ అగర్వాల్ అన్నారు.

Next Story

Most Viewed