త్వరలోనే అధికారంలోకి వస్తాం : శ్రీధర్ రెడ్డి

by  |
త్వరలోనే అధికారంలోకి వస్తాం : శ్రీధర్ రెడ్డి
X

దిశ, తిరుమలాయపాలెం: రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీ పార్టీనేనని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని బచ్చోడు గ్రామంలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన ముఖ్యాతిధిగా పాల్గొన్నారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో తెలంగాణాలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతాపార్టీనేనన్నారు. అట్టడుగు వర్గాలు అభ్యున్నతికి కొరకు నరేంద్రమోదీ ప్రభుత్వం పనిచేస్తుంటే రాష్ట్రంలో కేసీఆర్ నిరంకుశ కుటుంబ పాలన చేస్తున్నారన్నారు.

సీతా రామ ప్రాజెక్టు విస్తరణలో భూములు కోల్పోతున్న రైతుల పట్ల ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తున్నదని, ఆ రైతులకు ఎకరాకు 30 లక్షల రూపాయల పరిహారం లేదా ప్రాజెక్టు క్రింద భూమికి భూమి కొనివ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షలు బొడ్డుపల్లి ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కెళ్లపల్లి నరేందర్ రావు, జిల్లా ఉపాధ్యక్షడు గుండా శ్రీనివాస రెడ్డి, కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షుడు చావా కిరణ్, దళిత మోర్చ జిల్లా అధ్యక్షుడు కోటమర్తి సుదర్శన్, దళిత మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లగట్టు ఉపేందర్, అసెంబ్లీ కన్వీనర్ మేక సంతోష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సందీప్ రెడ్డి, యువ మోర్చ అద్యక్షులు లక్ష్మారెడ్డి, దళిత మోర్చ మండల అధ్యక్షులు నాగేశ్వర రావు, పార్టీలో చేరిన వారిలో దరమల్ల ఉపేందర్, గొర్రెపాటి లింగరాజు, గొర్రెపాటి శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed