ఆ టీఆర్ఎస్ నాయకుల పై చర్యలు తీసుకోండి : బీజేపీ

by  |
ఆ టీఆర్ఎస్ నాయకుల పై చర్యలు తీసుకోండి : బీజేపీ
X

దిశ,మహబూబాబాద్: దేశ ప్రధాని దిష్టి బొమ్మను దగ్దం చేసిన గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, మానుకోట ఎమ్మెల్యే శంకర్ నాయక్ లపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని మంగళవారం బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ఎల్డీ మల్లయ్య గౌడ్ మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ వెంకటరత్నం కు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేసిన నిరసన కార్యక్రమంలో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రధాన మంత్రి దిష్టి బొమ్మ ను దగ్ధం చేశారని ఆరోపించారు. వీరిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని.. లేనట్లయితే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

Next Story