ఇది చారిత్రాత్మక బడ్జెట్: బండి సంజయ్

by  |
ఇది చారిత్రాత్మక బడ్జెట్: బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను తెలంగాణ బీజేపీ శాఖ స్వాగతిస్తోందని, ఇది చారిత్రాత్మక బడ్జెట్ అని బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశప్రజల అంచనాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాసంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి ఆకాంక్షించే విధంగా బడ్జెట్‌ను రూపొందించారని, కరోనాతో నెమ్మదించిన ఆర్ధికవ్యవస్థకు మళ్లీ ఉరుకులు పెట్టించేలా, దేశ ప్రగతిపై విశ్వాసం పెంచేలా బడ్జెట్ ఉందని సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. మౌళికరంగంలో పెట్టుబడులు ప్రోత్సహించడం ద్వారా అన్నిరంగాలు దీర్ఘకాలిక అభివృద్ది దిశగా పయనిస్తాయన్నారు. మొట్టమెదటి సారిగా బడ్జెట్‌ను 6భాగాలుగా విభజించి ప్రతీ రంగానికి ప్రత్యేక నిధులు, విధానపర నిర్ణయాలు ప్రకటించడం ద్వారా ఆర్ధికప్రగతి పరుగు పెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.

జీడీపీలో ద్రవ్యలోటును 6.5%నికి నియంత్రించడం ద్వారా ఆర్ధికస్థితి మెరుగవడం ఖాయమని, ఆత్మనిర్భర ప్యాకేజీకి రూ.27.17లక్ష కోట్లు కేటాయించడంతో వైద్య, విద్య, ఉద్యోగ ఉపాధి రంగాలో అభివృద్ది సూచీ ఖచ్చితంగా కనపడుతుందన్నారు. పీఎం ఆత్మ నిర్భర్ స్వస్థ్ యోజన కింద.64,180 కోట్లు, వ్యాక్సిన్‌ కోసం రూ.35వేల కోట్లు జాతీయ స్థాయిలో 15అత్యవసర ఆరోగ్య కేంద్రాలు, 100 దేశాలకు వ్యాక్సిన్‌ సరఫరా చేయడం ప్రధాని మోడీ దార్శనికతతోనే సాధ్యమవుతుందన్నారు. ఒకే దేశం'ఒకే కార్డు అమలుతో వలస కార్మికులు ఎక్కడైనా రేషన్‌ తీసుకునే వెసులు బాటు ఉంటుందన్నారు.

Next Story

Most Viewed