సీఎం జగన్‌కు సోము వీర్రాజు లేఖ ఎందుకంటే…

by  |
సీఎం జగన్‌కు సోము వీర్రాజు లేఖ ఎందుకంటే…
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్‌కు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బుధవారం లేఖ రాశారు. పీజీ విద్యార్థులకు నష్టం చేసే జీవో నంబర్ 77ను వెంటనే రద్దు చేయాలని లేఖలో ఆయన కోరారు. ప్రభుత్వ నిర్ణయంతో 70వేల మంది విద్యార్థులకు నష్టం కలుగుతుందని తెలిపారు. ఈ జీవోతో ప్రైవేట్ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు రద్దవుతాయని చెప్పారు. ప్రభుత్వ కళాశాలల్లో సీటు దొరకక పోవడంతో చాలా మంది విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్నారని అన్నారు. ఇప్పుడు ప్రైవేట్ కళాశాల్లో చదివే వారికి ఫీజు రియింబర్స్ మెంట్ వర్తించదని ప్రభుత్వం చెప్పడం దుర్మార్గమని అన్నారు.

Next Story

Most Viewed