ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి చేదు అనుభవం

by  |
ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి చేదు అనుభవం
X

దిశ , ఆర్మూర్: రెండు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ఢీకంపల్లి గ్రామంలో ప్రతిష్ఠాపనకు సిద్ధంగా ఉన్న పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు అపహరించారు… గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టగా శుక్రవారం తెల్లవారు జామున బాసర గోదావరి తీరం వద్ద దేవత విగ్రహం దొరికింది. విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన దుండగులు బాసరలో దాన్ని వదిలేసి పారిపోయారు. విగ్రహాన్ని రికవరీ చేసిన పోలీసులు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. అయితే నిందితులను పట్టుకునెంత వరకు తాము ఆ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించబోమని ఢీకంపల్లి వాసులు మొండికేశారు.

ఈ విషయంలో టీఆర్‌ఎస్-బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. విషయం తెలిసి గ్రామానికి చేరుకున్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఢీకంపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. వారికి బీజేపీ నేతలు మద్ధతు పలికి ఘెరావ్ చేశారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యేతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హామీ మేరకు గ్రామస్తులు శాంతించారు. పెద్దమ్మ విగ్రహాన్ని అపహరించిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed