60 వేల డాలర్ల మార్కును చేరుకున్న బిట్‌కాయిన్!

by  |
60 వేల డాలర్ల మార్కును చేరుకున్న బిట్‌కాయిన్!
X

దిశ, వెబ్‌డెస్క్: క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ మరింత దూకుడుగా కొనసాగుతోంది. బిట్‌కాయిన్ ట్రేడింగ్‌లో రికార్డు స్థాయిలో 60 వేల డాలర్లను దాటేసింది. ఇది భారతీయ కరెన్సీలో చెప్పుకుంటే అక్షరాల రూ. 44 లక్షలు. డిజిటల్ కరెన్సీ మార్కెట్లో రారాజుగా ఉన్న బిట్‌కాయిన్ ఆల్ టైమ్ రికార్డు ఇది. గత నెలలో 58 వేల మార్కును చేరుకున్న తర్వాత 45 వేల డాలర్లకు పతనమైనప్పటికీ, తిరిగి పుంజుకుంది. గడిచిన నెల రోజుల్లో బిట్‌కాయి విలువ 2 శాతానికిపైగా వృద్ధిని సాధించింది. ఇటీవల డాలర్ బలహీనపడటం, ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పెట్టుబడిగా ఉన్న బంగారానికి క్రిప్టోకరెన్సీ సరైన ప్రత్యామ్నాయంగా మారినట్టు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బిట్‌కాయిన్ బంగారం కంటే విలువైన అవకాశంగా ఇన్వెస్టర్లు చూస్తున్నారు. దీంతో బంగారం కూడా బిట్‌కాయిన్ ప్రభావానికి గురవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సంక్లిష్ట పరిస్థితుల్లోనూ రికవరీ సాధించగల సత్తా బిట్‌కాయిన్‌కు ఉందని భావిస్తున్నారు. కేవలం ఏడాది కాలంలో బిట్‌కాయిన్ విలువ ఏకంగా 1000 శాతం వరకు పెరగడం చూస్తే దీని వేగం అర్థమవుతుందని చెబుతున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed