బద్వేలు నియోజకవర్గానికి సీఎం జగన్ బర్త్‌డే గిఫ్ట్  

by srinivas |
ap cm jagan
X

దిశ, ఏపీ బ్యూరో : వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. బద్వేలును రెవెన్యూ డివిజన్‌గా కేటాయిస్తామని హామీ ఇచ్చిన జగన్ మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా బద్వేలుకు సీఎం జగన్‌ కానుక అందించారు. బద్వేల్‌ను రెవెన్యూ డివిజన్‌గా కేటాయిస్తూ జీవో విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధకు బద్వేలు నియోజకవర్గ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ఇకపోతే ఈ ఏడాది జూలైలో బద్వేలు పర్యటనకు వచ్చిన సీఎం జగన్‌ బద్వేల్‌కు రెవెన్యూ డివిజన్‌ మంజూరు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం బద్వేలును రెవెన్యూ డివిజన్‌గా కేటాయిస్తూ మంగళవారం జీవో విడుదల చేశారు. బద్వేలు రెవెన్యూ డివిజన్ కోసం చాలా కాలంగా ప్రజలు పోరాటం చేస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చిన ఏడాదిలోపే బద్వేలును రెవెన్యూ డివిజన్‌గా కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed