- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Bird flu: కేరళలో బర్డ్ ఫ్లూ గుర్తింపు.. ఆ ప్రాంత సరిహద్దులో హై అలర్ట్
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కల్లోలం మరువక ముందే దేశానికి మరో ఉపద్రవం వచ్చి పడేలా ఉంది. తాజాగా కేరళ రాష్ట్రంలోని అలప్పుజాలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు అవ్వడం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ మేరకు తమిళనాడులోని కోయింబత్తూరులో ఆ రాష్ట్ర వైద్య శాఖ అధికారులు హైఅలర్ట్ విధించారు. కేరళ సరిహద్దులోని 12 చెక్‌పోస్టుల వద్ద భద్రతను పెంచారు. కేరళలోని అలప్పుజా జిల్లా కొయింబత్తూరు జిల్లా సరిహద్దులో ఉండటంతో వైరస్ తమ జిల్లాలోకి వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు చెపడుతున్నారు. ఈ విషయంలో ప్రజలు అంతగా భయపడాల్సిన అవసరం లేదని కోయింబత్తూరు వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. కేరళ ప్రభుత్వం అలప్పుజాలోని బాతుల్లో (H1N1) వేరియంట్‌ను గుర్తించింది. ఈ బాతుల బ్లడ్ శాంపిల్స్‌ను పరిశీలన కోసం భోపాల్‌లోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ సంస్థకు పంపించారు.