బిగ్‌బాస్‌లో మరో కొత్త ప్రేమాయణం మొదలుపెట్టిన రతిక

by Anjali |
బిగ్‌బాస్‌లో మరో కొత్త ప్రేమాయణం మొదలుపెట్టిన రతిక
X

దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున హోస్ట్‌గా చేస్తోన్న తెలుగు బిగ్‌బాస్ సీజన్-7.. నాలుగు వారాల్లో ముగియనుంది. రోజులు దగ్గర పడుతోన్న కొద్ది విన్నర్‌గా ఇంటికెళ్లాలని కంటెస్టెంట్లు బిగ్ బాస్ ఇచ్చే టాస్క్‌లు మరింత పట్టుదలతో ఆడుతున్నారు. అయితే నిన్న బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. అయితే ఈ టాస్క్‌లో మిసెస్ బిగ్‌బాస్‌ను చంపింది శివాజీ కానీ ఎవరికి తెలియకుండా ఈయన జాగ్రత్త పడాలి. అంబటి అర్జున్, అమర్ దీప్ పోలీసులు పాత్రలో ఉంటారు. అశ్విని, శోభాలను పార్టీలో ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ కవర్ చేయడానికి వచ్చిన రిపోర్టర్లుగా నటించాలి. యావర్, ప్రియాంకలు బ్రదర్, సిస్టర్లుగా సహాయకులుగా ఉండాలి. ఇక రతిక రోజ్‌కు పాత్ర ఇచ్చాడు. రతికను ప్రేమిస్తూ ఆమె చుట్టూ తిరిగే తోటమాలి గెటప్‌లో తిరగాలని గౌతమ్‌కు చెప్పాడు. ఇక ప్రశాంత్‌ వంటచేసేవాడిగా రోల్‌లో నటించాలి.

గౌతమ్ దొంగచాటుగా రతికను చూస్తూ ప్రేమించాలని బిగ్‌బాస్ చెప్పగా.. రాసుకొని పూసుకొని తిరగడం స్టార్ట్ చేశాడు. ఏకంగా రతిక బుగ్గ గిల్లుతాడు. నేను ఎప్పుడైనా నీతో మాట్లాడాలనుకుంటే ఇలా కన్ను కొడతానని రతిక.. గౌతమ్‌కు కన్ను కొట్టి మరీ చెప్పింది. మంచిగ కన్ను కొట్టావు. మళ్లీ ఒకసారి కొట్టవా రతిక అంటూ గౌతమ్ సిగ్గుపడుతూ అడుగుతాడు. రతిక నాకు రోజా పువ్వు తేలేదా అని అడుగుతుంది. నువ్వే రోజ్ ఫ్లవర్‌లా ఉన్నావు కదే. నీకు రోజ్ ఎందుకే అంటూ ఇద్దరూ ప్రేమ ముచ్చట్లలో మునిగిపోతారు. వీరి ప్రేమ ముచ్చట్లు చూసిన మేనేజర్ శివాజీ అలా చేయకూడదు బాబు అంటూ రతికను పక్కకు తీసుకెళ్తాడు. ఈ ఎపిసోడ్ చూసిన నెటిజన్లు పల్లవి ప్రశాంత్, యావర్‌తో లవ్ ట్రాక్‌లు అయిపోయాయి. ఇక కొత్తగా గౌతమ్‌తో స్టార్ట్ చేశావా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Next Story