బిగ్‌బాస్ కంటెస్టెంట్ పర్ఫామెన్స్‌ చూసి ఫిదా అయ్యాను.. ఆర్‌ఎక్స్‌ 100 హీరోయిన్

131
100X

దిశ, సినిమా: తెలుగు ఐదో సీజన్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రస్తుతం కంటెస్టెంట్ల మధ్య పోటీ జోరుగా కొనసాగుతుంది. ఇప్పటివరకు ఆరుగురు వెళ్లిపోగా ప్రస్తుతం 13 మంది మాత్రమే మిగిలారు. ఇక ఈ వారంలో మరొకరు ఎలిమినేట్ అవనున్నారు. ఈ క్రమంలో తమ అభిమాన కంటెస్టెంట్లను కాపాడుకునేందుకు పలువురు బుల్లితెర సెలబ్రిటీలు ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఓ కంటెస్టెంట్‌ కోసం టాలీవుడ్‌ హీరోయిన్‌ ‘ఆర్‌ఎక్స్‌ 100’ హాట్ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ రంగంలోకి దిగింది. తన ఫ్రెండ్‌ సింగర్‌ శ్రీరామచంద్రకు మద్దతు తెలుపుతూ.. అతనికి ఓటేయమంటూ నెటిజన్లను రిక్వెస్ట్ చేస్తోంది. ‘నా ఫ్రెండ్‌ శ్రీరామ్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నాడు. అతడు చాలా బాగా ఆడుతున్నాడు. నేను కొన్ని ఎపిసోడ్లలో శ్రీరామ్‌ పర్ఫామెన్స్‌ చూసి ఓ మై గాడ్‌ అనుకున్నాను. అప్రిసియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. నా బెస్ట్‌ విషెస్‌ నీకెప్పుడూ ఉంటాయి. శ్రీరామ్‌కు ఓటేసి మీ ప్రేమాభిమానాలను చాటుకోండి. ప్రతీ ఓటు కూడా విలువైనదేనని గుర్తుంచుకోండి’ అని ఆ సింగర్‌కు సపోర్ట్‌గా నిలిచింది పాయల్.. ఇక ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ మూవీస్‌తోపాటు ‘బంగార్రాజు’ మూవీ‌లో ఒక స్పెషల్ సాంగ్‌లో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..