- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
స్మగ్లర్లు, దొంగలు, గూండాలు.. వీళ్ళేనా మన హీరోలు?
దిశ, వెబ్ డెస్క్: ‘గాంధీ అని సినిమా తియ్.. సినిమా పెద్దగా ఆడదు. అదే కడప కింగ్ అని తియ్. 175 సెంటర్స్, 100 డేస్ పక్కా..’ అంటూ పోకిరీ సినిమాలో షియాజీ షిండే మీడియాతో చెప్పే ఈ డైలాగ్ గుర్తుందా..? సరిగ్గా ఇప్పుడు సేమ్ టూ సేమ్ అదే జరుగుతోంది. దీనికి పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్ మొన్న రిలీజ్ అయిన పుష్ప 2. ఈ సినిమా మీలో ఎంతమంది చూశారు..? ఈ క్వశ్చన్ అడడగానే.. మీలో చాలామంది నేనేదో పుష్ప సినిమాని క్రిటిసైజ్ చేయడానికే ఈ వీడియో చేస్తున్నాను అనుకుంటారు. బట్.. ఆ ఆలోచన పక్కన పెట్టి ఒక్కసారి వీడియో చూడండి.
మన హీరోలు ఎవరు? ఓ దొంగ, ఓ స్మగ్లర్, ఓ గ్యాంగ్‌స్టర్, ఓ మర్డరర్, ఓ డాన్.. ఇప్పుడు వీళ్లే కదా?. మన కుర్రాళ్లకి రోల్ మోడల్స్ ఎవరు? ఓ రోగ్, ఓ సైకో, ఓ గాలోడు, ఓ ఆవారా.. ఇద్దరు, ముగ్గురు లవర్లని మెయిన్‌టెయిన్ చేసేవాడు. ఏంటి ఒప్పుకోరా..? అయితే రీసెంట్‌గా సూపర్, డూపర్, బ్లాక్‌బస్టర్ హిట్లు కొట్టిన కొన్ని సినిమాల పేర్లు చెప్తా.. వాళ్లలో హీరోలెవరో చెప్పండి.
పుష్ప 2, కేజీఎఫ్, సలార్, కల్కి, దేవర, లక్కీ భాస్కర్, యానిమల్, అర్జున్ రెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని సినిమాలు. వీటిలో హీరోలు ఎవరు..? సమాజాన్ని ఉద్ధరించే రోల్ మోడల్సా..? కాదు.. పోనీ..! జనాలకి మంచి మెసేజ్ ఇచ్చే వ్యక్తులా.. ఛాన్సే లేదు. కానీ ఈ సినిమాలన్నీ సూపర్, బ్లాక్‌బస్టర్ హిట్లు. దీనికి కారణం ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
పుష్ప సినిమాలో హీరో ఎవరు? పోలీసుల్ని, చట్టాన్ని లెక్క చేయకుండా ఎర్రచందనం చెట్లు కొట్టి స్మగ్లింగ్ చేసే ఓ స్మగ్లర్. కేజీఎఫ్ సినిమాలో హీరో ఎవరు? మొత్తం దేశాన్నే వణికిస్తూ తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న ఓ గ్యాంగ్‌స్టర్. సలార్‌లో కూడా హీరో ఓ మర్డరర్.. ఓ బీస్ట్. చట్టంతో సంబంధం లేకుండా పనిచేసే ఓ వైల్డ్ పర్సన్. దేవరలో హీరో షిప్పుల్ని దోచుకునే స్మగ్లర్. కల్కి, హనుమాన్ సినిమాల్లో హీరోలు చిల్లర దొంగలు. లక్కీ భాస్కర్ సినిమాలో హీరో బ్యాంకుల్ని దోచుకునే ఘరానా దొంగ. ఇక యానిమల్ మూవీలో హీరో కనీసం జ్ఞానం కూడా లేని జంతువులాంటి ఓ సైకో. అర్జున్ రెడ్డిలో హీరో ఓ రోగ్.
కానీ వీళ్లందరూ మనకి హీరోలు. రోల్ మోడల్స్. వాళ్లు పోలీసుల్ని చితక్కొడుతుంటే మనం విజిల్స్ వేసి గోల చేస్తాం. జనాల్ని చంపుతుంటే తెగ హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. సొసైటీని మోసం చేసి వేల కోట్లు దోచుకుంటుంటే వాడేదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్లు కళ్లప్పగించి చూస్తాం. ఆడవాళ్లని అవమానిస్తుంటే అదే హీరోగిరీ అన్నట్లు కాలరెగరేస్తాం. ఒకవేళ హీరో పోలీస్ అయినా సరే.. రూల్స్ బ్రేక్ చేసి తన సీనియర్ ఆఫీసర్లని ఎదిరించడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని రౌడీల్ని ఇరగ్గొట్టడం చేస్తే అసలు మనకి పూనకాలొచ్చేస్తాయి. కానీ మీకు తెలుసా..? ఈ మెంటాలిటీ మానవ సమాజానికి ఏ మాత్రం పనికి రాదు. ఇది 200 పర్సెంట్ ఆటవిక జంతువుల మెంటాలిటీ. ఇంకా మాట్లాడితే ఆదిమానవులు మాత్రమే ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ఆడవాళ్లని జస్ట్ థింగ్స్‌గా భావిస్తూ వయలెన్స్‌లో బతుకుతారు. కేజీఎఫ్ సినిమాలో ‘వయలెన్స్’ డైలాగ్ దానికే ప్రూఫ్.
బట్ అసలు ఈ మెంటాలిటీకి కారణం సినిమాలు తీసే డైరెక్టర్లా..? లేకపోతే సినిమాలు చేసే జనాలా..? అంటే ఆన్సర్ అంత క్లియర్‌గా ఉండదు. ఎందుకంటే ఇది కోడి ముందా..? గుడ్డు ముందా..? అన్నట్టే ఉంటుంది. వాళ్లు చూస్తున్నారు కాబట్టి.. మేం తీస్తున్నాం అంటారు డైరెక్టర్లు, నిర్మాతలు. వాళ్లు తీస్తున్నారు కాబట్టి మేం చూస్తున్నాం అంటారు జనాలు. సో ఇక్కడ ఎవరిది తప్పు అనేది చెప్పడం చాలా కష్టం. బట్.. ఒకవేళ ఎవరైనా మంచి సినిమాలు తీస్తే అవి థియేటర్‌కి వెళ్లి చూసేవాళ్లు చాలా తక్కువ.
ఏంటీ మెంటాలిటీ..?
ఇలాంటి మెంటాలిటీకి ప్రధాన కారణం ఫ్రస్ట్రేషన్. రోజువారీ బిజీ లైఫ్‌లో మనం ఎంతోమందిని హేట్ చేస్తాం. బాస్‌లు పెట్టే టార్చర్, కొలీగ్స్ చేసే పాలిటిక్స్‌తో వచ్చే కోసం కోపం అన్నింటినీ భరించడం వల్ల తట్టుకోలేని ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కానీ వాళ్లని ఏమీ అనలేం. ఎందుకంటే మనకి బతకాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఉద్యోగంతోనే వస్తాయి. అందుకే మన ఫ్రస్ట్రేషన్ మొత్తం అణుచుకుంటాం. మనకి నచ్చకపోయినా రూల్స్‌కి తల వంచి బతుకుతుంటాం. ఎప్పుడైతే సినిమాల్లో హీరో విలన్లని కొడుతూ రూల్స్ బ్రేక్ చేస్తాడో, ఎప్పుడైతే ఎవ్వరినీ పట్టించుకోకుండా తనకి నచ్చినట్లు బతుకుతాడో.. అది చూసి మనల్ని మనం ఆ హీరో ప్లేస్‌లో ఊహించుకుని శాటిస్‌ఫై అవుతాం. అలా ఫ్రస్ట్రేషన్ తగ్గించుకుంటాం. దానివల్లే మనం ఇలాంటి సినిమాలకి అడిక్ట్ అయిపోతుంటాం. రియల్ లైఫ్‌లో రూల్స్ అంటే భయపడే ప్రతి ఒక్కళ్లూ సినిమాల్లో హీరోలు రూల్స్ బ్రేక్ చేస్తూ హీరోయిజం చూపిస్తుంటే తానే అలా చేస్తున్నానని అనుకుంటూ సెల్ఫ్ శాటిస్‌ఫ్యాక్షన్ పొందుతుంటారు.
సైంటిఫిక్ రీజన్:
మనం ఈ టైఫ్ ఆఫ్ సినిమాలకి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నాం..? అనే విషయానికి సైకాలజిస్ట్‌లు, ఎక్స్‌పర్ట్స్ చెప్పే ఆన్సర్ అడ్రినలిన్ అండ్ డోపమైన్. ఇందులో ముఖ్యంగా వయలెన్స్, గోర్, హారర్ సినిమాలు చూసినప్పుడు మనలో సస్పెన్స్, ఇంటెన్స్ ఎక్స్‌పీరియన్స్, అగ్రెషన్ లాంటి ఫీలింగ్స్ మొదలవుతాయి. ఈ ఫీలింగ్స్ వల్ల అడ్రినలిన్ రిలీజ్ అవుతుంది. ఈ అడ్రినలిన్ రష్ ఆదిమానవుల్లో విపరీతంగా ఉండేది. దీనివల్లే అప్పట్లో వేటాడే ధైర్యం వాళ్లకి వచ్చేది. అలాగే ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మ్యూట్యువల్ ఫైట్స్, యుద్ధాలకు రెడీ అయ్యేవాళ్లు. కానీ రాను రాను సమాజం మారడం వల్ల ఈ అడ్రినలిన్ రష్ తగ్గుతూ వచ్చింది.. అలాగే దీన్ని శాటిస్‌ఫై చేసుకునే మార్గాలు కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు దీనికున్న ఒకే ఒక్క మార్గం మూవీస్. మూవీస్‌లో హీరో లేదా హీరోయిన్‌ని చూసి.. వాళ్ల క్యారెక్టర్‌లో తనని తాను ఊహించుకుని అడ్రినలిన్ రష్‌ని శాటిస్‌ఫై చేసుకుంటున్నారు.
అలాగే ఆల్రెడీ మెంటల్ స్ట్రెస్‌లో ఉన్న పర్సన్‌కి ఈ ఇంటెన్స్ ఫీలింగ్స్ అనేవి రిలాక్సేషన్ ఇస్తాయి. అప్పుడు మైండ్‌లో రిలాక్స్ హార్మోన్‌గా చెప్పే డోపమైన్ కూడా రిలీజ్ అవుతుంది. డోపమైన్‌ని అడిక్టివ్ హార్మోన్ అని కూడా అంటారు. సిగరెట్స్, లిక్కర్, అడల్ట్ ఫిలిమ్స్.. ఇలాంటివాటికి కూడా అడిక్ట్ అవడానికి ఈ హార్మోనే కారణం. దీనివల్లే వయలెంట్ సినిమాలకు మనుషులు అడిక్ట్ అయిపోతున్నారు.
అడిక్ట్ అయితే ఎలాగోలా మార్చుకోవచ్చు.. కానీ వీళ్లలో కొంతమంది సినిమాలో చూపిస్తున్నారు కాబట్టి.. అలా నిజంగానే చేయొచ్చు.. అనే సైకోటిక్ మెంటాలిటీని బిల్డ్ చేసుకుని.. దాని వల్ల క్రిమినల్స్‌గా మారిపోతున్నారు. ఇదేదో జస్ట్ గాల్లో చెబుతున్న మాట కాదు.. పక్కా ప్రూఫ్స్‌తో చెబుతున్న మాట. ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డికి బాలీవుడ్ రీమేక్ కబీర్ సింగ్ సినిమా చూసి ఓ సైకో బాయ్‌ఫ్రెండ్ తనని కాదని వేరే పర్సన్‌ని పెళ్లి చేసుకోబోతున్న గర్ల్ ఫ్రెండ్‌ని చంపేశాడు. కేజీఎఫ్ చూసి ఓ 19 ఏళ్ల కుర్రాడు తను కూడా గ్యాంగ్‌స్టర్ కావాలనే అబ్సెషన్‌తో ఐదుగురిని చంపేశాడు. వాళ్లలో పాపం నలుగురు సెక్యూరిటీ గార్డ్స్ నిద్రపోతుండగా గొంతు కోసి చంపేశాడు. అక్కడిదాకా ఎందుకు మీరంతా ఎగబడి చూస్తున్న పుష్ప2 ఫస్ట్ పార్ట్ పుష్ప మూవీ చూసి ఢిల్లీలో ఓ కుర్రాడు ఏ కారణం లేకుండా ఓ పర్సన్‌ని చంపేశాడు. ఎందుకు చంపావ్‌రా అంటే.. నేను కూడా పుష్పరాజ్‌లా గ్యాంగ్‌స్టర్ కావాలని చంపేశా అని చెప్పాడు. అలాగే 1988లో వచ్చిన అంతిమ తీర్పు అనే సినిమా చూసి ఇన్‌స్పైర్ అయిన మొద్దు శ్రీను టీడీపీ ఎమ్మెల్యే పరిటాల రవిని హత్య చేశాడు. 1993లో వచ్చిన బాలీవుడ్ ఫిల్మ్ డర్ సినిమా చూసి 2016లో ఓ ఎంప్లాయీ సైకోలా మారి తన కొలీగ్ అయిన అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. రీసెంట్‌గా ముంబైలో శ్రద్ధా వాకర్‌ని ముక్కలు ముక్కలుగా నరికి చంపిన బాయ్‌ఫ్రెండ్ అఫ్తాబ్ అమిన్.. హాలీవుడ్ సినిమా డెక్స్‌టర్ సినిమా చూసి ఇన్‌స్పైర్ అయ్యాడంట. నెట్‌ఫ్లిక్స్‌లో మనీ హైయిస్ట్ వెబ్ సిరీస్ చూసి లక్నోలో ఓ పర్సన్ తన గ్రూప్‌తో కలిసి ఓ జ్యూవలరీ స్టోర్‌లో భారీ దొంగతనం చేశాడు. ఇవి జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో.
జస్ట్ క్రైమ్స్ మాత్రమే కాదు.. ఇది యూత్ అండ్ టీనేజర్స్ మెంటాలిటీని కూడా కంప్లీట్‌గా ఎఫెక్ట్ చేస్తోంది. ఇండిపెండెంట్‌గా, గొప్పగా బతకాలనే ఆలోచన మంచిదే. కానీ తప్పు చేస్తూ కూడా అది నా ఇష్టం అనే మెంటాలిటీ కచ్చితంగా మనల్నే డెస్ట్రాయ్ చేస్తుంది. ఇప్పుడు వచ్చే 90 పర్సెంట్ సినిమాల వల్ల అదే జరుగుతోంది. హీరోలకి క్రైమ్ చేయడం, పెద్దవాళ్ళని నెగ్‌లెక్ట్ చేయడం, హీరోయిన్లు ఎక్స్‌పోజింగ్, రొమాన్స్‌లో న్యూడ్ సీన్స్., లవర్స్‌ని చీట్ చేయడం.. ఇవన్నీ చూసి.. ఇదే కరెక్టే అనే మెంటాలిటీ యూత్‌లో వచ్చేస్తోంది. ఇక టీనేజర్స్ తల్లిదండ్రుల్ని ఎదిరించి, ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయడమే హీరోయిజం అనుకుంటున్నారు. దీనివల్ల రిలేషన్స్ కంప్లీట్‌గా డెస్ట్రాయ్ అయిపోతున్నాయి. చివరికి మనం ఇదంతా రియలైజ్ అయ్యే టైంకి మన లైఫ్ కంప్లీట్‌గా నాశనమైపోయి ఉంటుంది.
సొల్యూషన్ ఏంటి?
దీనికి సొల్యూషన్ సినిమా తీసేవాళ్లలోనే ఉంది. మనకి డబ్బులు కావాలి కాబట్టి కాబట్టి ఆ సినిమాలో 10 మందిని హీరో నరికితే జనాలు హిట్ చేశారు. కాబట్టి మనం 100 మందిని హీరో చేతిలో నరికిస్తే.. బంపర్ హిట్ కొట్టొచ్చు. ఆ సినిమాలో హీరో మెషీన్ గన్‌తో ఇష్టం వచ్చినట్లు కాల్చేస్తే.. బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. కాబట్టి మనం 10 మెషీన్ గన్స్‌తో కాల్పిద్దాం.. ఆ సినిమాలో హీరో ఒక్క విలన్ తల నరికి చంపితే హిట్ అయింది.. కాబట్టి మనం 10 మంది తల నరికిద్దాం.. భారీ హిట్ అవుతుంది. ఆ సినిమాలో హీరో దొంగ కాబట్టి హిట్ అయింది కాబట్టి మన సినిమాలో గజదొంగని హీరో చేద్దాం.. ఇలా మంచికి, చెడుకి ఉండే ఓ సెన్సిబుల్ లైన్‌ని చెరిపేసుకుంటూ ముందుకు పోతున్నారు.. దానివల్ల సినిమాల్లో వయలెన్స్ పెరిగిపోతోంది. దానికి జనాలు అడిక్ట్ అవుతున్నారు.. అదే కరెక్ట్ అనుకుంటున్నారు. కాబట్టి మారాల్సింది ఫిల్మ్ స్టాండర్డ్స్. మనం కూడా సినిమాని సినిమాలా చూడాలి.. రియాలిటీని రియాలిటీగా చూడాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సమాజానికి ఎంత అవసరమో అర్థం చేసుకుని.. రిలేషన్స్‌కి రెస్పెక్ట్ ఇస్తూ ముందుకెళ్లాలి. ఏమంటారు..?