తెలంగాణ ఖాతాలో చెత్త రికార్డు.. కేసీఆర్ సర్కార్‌పై సంచలన నివేదిక

by  |
తెలంగాణ ఖాతాలో చెత్త రికార్డు.. కేసీఆర్ సర్కార్‌పై సంచలన నివేదిక
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ఆసుపత్రుల పరిస్థితిపై నీతి ఆయోగ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా వంటి అత్యవసర వైద్య పరిస్థితులు ఏర్పడితే ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు సరిపడా వైద్యసిబ్బంది, ఆసుపత్రుల్లో బెడ్స్ లేకపోవడాన్ని నీతి ఆయోగ్ గుర్తించింది. దేశంలోని జిల్లా ఆసుపత్రుల పనితీరుపై ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ నివేదికలో తెలంగాణ పనితీరు మిశ్రమంగా ఉంది. రాష్ట్రంలో లక్ష మందికి కేవలం 10 బెడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని నివేదికలో వెల్లడించింది.

అయితే భారతీయ ప్రజారోగ్య ప్రమాణాల ప్రకారం లక్ష మందికి కనీసం 22 పడకలు ఉండాలి. ఇలా తక్కువ పడకలు అందుబాటులో ఉన్న రాష్ట్రాల్లో(కింద నుంచి) తెలంగాణ మూడవ స్థానంలో ఉంది. జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలు మొదటి, రెండు స్థానాల్లో(కింద నుంచి) ఉన్నాయి. అయితే తెలంగాణలోని ఆసుపత్రుల్లో రోగులకు అందించే నీరు, ఆహారంతో పాటు నిరంతర విద్యుత్, పోస్ట్‌మార్టం సదుపాయం వంటి ప్రాథమిక సహాయక సేవలను అందించడంలో బాగా పనిచేస్తున్నారని తెలిపింది. ప్రధాన ఆరోగ్య సేవలను ఉత్తమంగా అందించినట్లు నివేదికలో వెల్లడైంది.

Next Story

Most Viewed