OnePlus స్మార్ట్‌ఫోన్‌‌లపై భారీ తగ్గింపు..

by  |
oneplusnord2
X

దిశ, వెబ్‌డెస్క్ : OnePlus స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. OnePlus Nord 2, Nord 2 PAC-MAN ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు Amazon, OnePlus.in లో తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్లపై రూ.2.000 వరకు ఆఫర్ ఇస్తున్నారు. ICICI బ్యాంక్ కార్డ్‌, EMI పై రూ.3,000 తగ్గింపు ఇస్తున్నారు. ఈ ఆఫర్‌లు డిసెంబర్ 31, 2021 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

OnePlus Nord 2 మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. 6GB+128GB వేరియంట్ ధర రూ.2000 తగ్గింపుతో రూ.25,999 వస్తుంది. 8GB+128GB ధర రూ.27,999. 12GB+256GB ధర రూ.32,999 లో లభిస్తుంది. దీని ఫీచర్స్ 6.43-అంగుళాల FHD+ ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లేతో 20:9 యాస్పెక్ట్ రేషియో, 90Hz రిఫ్రెష్ రేట్, 410 ppi పిక్సెల్ డెన్సిటీ, AI కలర్ బూస్ట్ , AI రిజల్యూషన్ బూస్ట్, P3 కలర్ sRGB ని కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆక్సిజన్‌ ఓఎస్‌ పై పనిచేస్తుంది. 65W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీని అందిస్తుంది.

OnePlus Nord 2 PAC-MAN ఎడిషన్ 12GB+256GB స్టోరేజ్‌లో లభిస్తుంది. అసలు ధర రూ.37,999. Amazon India, OnePlus.inలో ఆఫర్‌తో రూ.3,000 ధర తగ్గింపుతో రూ.34,999 కే లభిస్తుంది. అమెజాన్‌లో, OnePlus.in లో ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.



Next Story

Most Viewed