తల్లి పాలతో ఆభరణాలు తయారుచేస్తున్న నమిత

by  |
talli-palu
X

దిశ, ఫీచర్స్: ఓ కుటుంబం పండంటి బిడ్డతో ఆశీర్వదించబడితే, వారి మిగతా సమస్యలన్నీ అదృశ్యమవుతాయి. నవజాత శిశువు ఆ తల్లిదండ్రులకు ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తుంది. అప్పటిదాకా గడిపిన సాధారణ జీవితానికి ఆ శిశువు స్పర్శ కొత్తరూపును ఇస్తుంది. ముఖ్యంగా తల్లులు, తమ పిల్లలకు సంబంధించిన ప్రతీ ఆనంద క్షణాన్ని భద్రంగా దాచుకోవాలని కోరుకుంటారు. ఇదే రకమైన ఫీలింగ్స్ అనుభవించిన బెంగళూరుకు చెందిన నమిత నవీన్.. ఒక యూనిక్ ఐడియాతో ముందుకొచ్చింది. తన బిడ్డ బొడ్డు తాడు, పాల పళ్లు, మొదట కత్తిరించిన గోర్లు, వెంట్రుకలతో పాటు బ్రెస్ట్ మిల్క్ యాడ్ చేసి.. ఆభరణాలు, అనేక రకాల జ్ఞాపకాలను రూపొందించుకుంది.

నమిత నవీన్‌‌.. తన కొడుకు జ్ఞాపకాలను శాశ్వతంగా భద్రపరచాలని అనుకున్నప్పుడు ఆమెకు ‘మమ్మాస్ మిక్కీ టేల్ జ్యువెల్స్‌’ను ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది. తను బయోటెక్నాలజీలో MSc చదవడం కూడా సంబంధిత రీసెర్చ్‌కు ఉపయోగపడింది. ఇక చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డల మొదటి వేలి గోర్లను పేపర్‌లో లేదా పెట్టెలో భద్రపరుస్తారు. కానీ కాలక్రమేణా వాటిని పోగొట్టుకుంటారు. అలా కాకుండా ‘పెండెంట్‌, ఉంగరం, చెవిపోగులు’గా ఆ జ్ఞాపకాలన్నింటినీ అందమైన రీతిలో శాశ్వతంగా భద్రపరచాలనుకున్న నమిత.. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు ‘లైఫ్‌ కాస్టింగ్’గా పిలువబడే కళారూపాన్ని రూపొందించేందుకు ఆరు నుంచి ఎనిమిది నెలలు రీసెర్చ్ చేసింది. చివరగా స్వర్ణకారుడు తయారు చేసిన ఆభరణాల్లోని కొద్ది భాగంలో తల్లి పాలు, శిశువు జుట్టు, గోరు, బొడ్డు తాడును భద్రపరచడం మొదలెట్టింది. కాగా ఇలాంటి ప్రత్యేకమైన ఆభరణాలను మొదట తయారుచేసింది తామే కావచ్చని వివరించింది ‘నమిత నవీన్’. ఈ ప్రక్రియ చాలా కష్టం. ఎందుకంటే తల్లి పాలను ఒక రోజు భద్రపరిచిన తర్వాత కొన్ని రసాయనాలు కలిపి ఎండలో ఆరబెట్టాల్సి ఉంటుంది. అప్పుడది చూర్ణంగా, ఆ తర్వాత పొడిగా మారుతుంది.

Next Story

Most Viewed