ముదిరాజులకు మంచిరోజులు.. ఎందుకో తెల్సా

by  |
ముదిరాజులకు మంచిరోజులు.. ఎందుకో తెల్సా
X

దిశ, తుంగతుర్తి: ప్రత్యేక రాష్ట్ర సాధనతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే ముదిరాజులకు మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మెన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం యాదాద్రి జిల్లా మోత్కూర్ మత్స్య సొసైటీకి చెందిన రైతు మన్నె భీమయ్య రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 75 శాతం సబ్సిడీ కింద సాగు చేసిన చెరువులోని చేపలు పట్టే కార్యక్రమాన్ని కంచర్ల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నీలి విప్లవం ద్వారా ముదురాజుల బతుకుల్లో వెలుగులు నిలిపిందన్నారు. మత్స్యకారులకు సబ్సిడీ కింద టీవీఎస్ ఎక్సెల్, బోలోరా వాహనాలు, చేపల వలలు ఇస్తూ చెరువుల ఏర్పాటు కోసం రుణాలు ఇచ్చిందన్నారు. నీలి విప్లవం ద్వారా దేశంలోనే ముదిరాజులకు, మత్స్యకారులకు పెద్ద పీట వేసిన ఏకైక ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచారన్నారు. ఆరోగ్యానికి మంచి ఆహారమైన చేపల్ని అందరూ భుజించి సంపూర్ణ ఆరోగ్యంతో నిలవాలన్నారు. అదే విధంగా మత్స్యకారులు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.25000 వేల వ్యక్తిగత రుణాలు పొందాలన్నారు.

Next Story

Most Viewed