బెగ్గర్స్‌కు యోగా, కంప్యూటర్ క్లాసెస్

by  |
బెగ్గర్స్‌కు యోగా, కంప్యూటర్ క్లాసెస్
X

దిశ, ఫీచర్స్: రోడ్లు, దేవాలయాలు, పార్కులు, బస్టాండ్లతో పాటు ఇతరత్రా జనసందోహ ప్రాంతాల్లో భిక్షమెత్తుకునే వారిని చూస్తుంటాం. అయితే వారు పుట్టుకతో బిచ్చగాళ్లు కారు. పరిస్థితుల ప్రభావం వల్ల కొందరైతే, ఉపాధి కరువై ఆకలికి తట్టుకోలేక ఏపని చేయాలో తోచక మరికొందరు బెగ్గింగ్‌ను వృత్తిగా ఎంచుకుని ఉంటారు. కాగా రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో 1,163 మంది బెగ్గర్స్ ఉన్నట్లుగా జైపూర్ పోలీస్ కమిషనరేట్ గుర్తించింది. ఇందులో ఐదుగురు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉండగా..193 మంది స్కూలింగ్ కంప్లీట్ చేసిన వారు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది తమ మనుగడ కోసమే భిక్షాటన చేస్తున్నట్లు తేలింది. ఈ క్రమంలో బిచ్చగాళ్లకు పునరావసం కల్పించాలని, రాజస్థాన్ ‘బెగ్గర్స్ ఫ్రీ స్టేట్‌’గా ఉండాలని నిర్ణయించిన ఆ రాష్ట్ర సర్కారు.. ఇందుకోసం పైలట్ ప్రాజెక్టు కింద జైపూర్‌ సిటీని సెలెక్ట్ చేసింది. ఈ మేరకు ప్రస్తుతం ఆఫీసర్లు.. బెగ్గర్స్‌కు లైఫ్ స్కిల్స్(యోగా, కంప్యూటర్, స్పోర్ట్స్) నేర్పిస్తున్నారు.

‘బెగ్గర్ ఫ్రీ రాజస్థాన్’ (beggar free) పథకంలో భాగంగా వీధుల్లో భిక్షాటన చేసే వారికి ఆర్ఎస్ఎల్‌డీసీ(రాజస్థాన్ స్కిల్ అండ్ లైవ్లీహుడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్), సోపన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ సంయుక్తంగా నైపుణ్యాభివృద్ధి తరగతులు నిర్వహిస్తున్నాయి. వీరికి షెల్టర్ కల్పించి యోగా, స్పోర్ట్స్, కంప్యూటర్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. ట్రైనింగ్ అనంతరం వీరికి ఉపాధి కల్పించనున్నారు. పైలట్ ప్రాజెక్టు సక్సెస్ కాగానే ఈ స్కీమ్‌ను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించాలని సర్కారు ఆలోచిస్తున్నట్లుగా ఆఫీసర్లు పేర్కొన్నారు. జైపూర్‌‌కు స్వరాష్ట్రంలో ఉన్న వారే కాకుండా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి బెగ్గింగ్‌ చేస్తున్నారని గుర్తించారు. అయితే వారంతా బెగ్గింగ్ వృత్తిని వదిలేసి, తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని వేరే రంగంలో గౌరవప్రదంగా జీవించేందుకు ఈ పైలట్ ప్రాజెక్టు చేపట్టినట్లు సర్కారు పేర్కొంది. ప్రస్తుతం జైపూర్‌లోని ఆర్ఎల్‌ఎస్‌డీసీ..‘కౌశల్ వర్ధన్’ కేంద్రాల్లో బ్యాచ్‌ల వారీగా భిక్షాటన చేసే వారికి స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు. బ్యాచ్‌కు 20 మందిని కేటాయిస్తున్నారు. శిక్షణ అనంతరం తమ నైపుణ్యాన్ని బట్టి అక్షయ పాత్ర ఫౌండేషన్ సహకారంతో ఉపాధి కల్పిస్తున్నారు. వీరిని ఎలక్ట్రీషియన్లు, గార్డ్స్, బ్యూటీషియన్స్, కుక్స్‌గా తీర్చిదిద్ది ఉపాధి కల్పించనున్నారు.

Next Story