శ్రీలంక వెళ్లే టీమ్ ఇండియాకు ఫిట్‌నెస్ టెస్టులు లేవు

by  |
team india
X

దిశ, స్పోర్ట్స్ : శ్రీలంకలో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడటానికి వెళ్లనున్న టీమ్ ఇండియా జట్టుకు బీసీసీఐ కొన్ని మినహాయింపులు ఇచ్చింది. భారత జట్టులో స్థానం సంపాదించిన ప్రతీ క్రికెటర్ యో-యో టెస్టుతో పాటు 2 కిలోమీటర్ల పరుగును నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నిబందనల కారణంగా గతంలో వరుణ్ చక్రవర్తి వంటి క్రికెటర్లు పలు సిరీస్‌లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం పూర్తి జట్టు అందుబాటులో లేని కారణంగా ధావన్ నేతృత్వంలోని టీమ్ ఇండియాకు ఆ రెండు పరీక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది.

దేశంలో కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ఆటగాళ్లకు పూర్తి స్థాయిలో ట్రెయినింగ్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి వీలుపడటం లేదు. అందుకే ఈ రెండు పరీక్షల నుంచి తాత్కాలికంగా మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తున్నది. మరోవైపు శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న క్రికెటర్లు అందరూ ముంబై చేరుకున్నారు. వారందరికీ కోవిడ్ టెస్టులు నిర్వహించిన అనంతరం క్వారంటైన్‌లోకి పంపుతారు. వారం రోజుల పాటు కఠిన క్వారంటైన్ అనంతరం మరో వారం రోజులు సాధారణ క్వారంటైన్‌లో ఉండనున్నారు.



Next Story

Most Viewed