'ఐపీఎల్ విషయంలో బీసీసీఐ తప్పు లేదు'

by  |
ఐపీఎల్ విషయంలో బీసీసీఐ తప్పు లేదు
X

దిశ, స్పోర్ట్స్ : కరోనా సెకెండ్ వేవ్ తీవ్రంగా ఉన్న సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహించి బీసీసీఐ తప్పు చేసిందని పలు విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే బీసీసీఐ మాజీ కార్యదర్శి నిరంజన్ షా మాత్రం బోర్డు నిర్ణయాన్ని సమర్దించాడు. ఐపీఎల్‌ను ఇండియాలోనే నిర్వహించాలనే బోర్డు నిర్ణయం సరైనదే అని నిరంజన్ షా అన్నాడు. “ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను ఇండియాలో కాకుండా ఇంకెక్కడ నిర్వహిస్తారు. ప్రతీ సారి యూఏఈలోనో మరో వేరే వేదిక మీదో ఐపీఎల్‌ను నిర్వహించలేం. బీసీసీఐ తీసుకున్న నిర్ణయం నూటికి నూరుపాళ్లు సమర్దనీయమే” అని నిరంజన్ షా అన్నారు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు ఇండియాలో పరిస్థితులు ఇంత ప్రమాదకరంగా లేవు కాబట్టే బీసీసీఐ ఆ నిర్ణయం తీసుకున్నదని షా అన్నారు. టోర్నీ కొన్ని రోజుల పాటు జరిగి ఆగిపోవడం వల్ల బాధపడాల్సిన అవసరం లేదని.. ఇది మంచి నిర్ణయమే అని ఆయన అన్నారు.


Next Story

Most Viewed