ఆ భూములు అన్యక్రాంతం చేస్తే ఊరుకోం..

by  |
ఆ భూములు అన్యక్రాంతం చేస్తే ఊరుకోం..
X

దిశ, హన్మకొండ: బీసీ కులాలకు కేటాయించిన భూమిలో ఒక్క గుంట భూమిని అన్యాక్రాంతం చేసిన ఊరుకునేది లేదని, ప్రభుత్వ అధికారులు సర్వేను వెంటనే ఉపసంహరించుకొని ఆ భూమిని బీసీలకే కేటాయించాలని వరంగల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని మర్రిపల్లిగూడెం గ్రామంలో బీసీ కులాలకు ప్రభుత్వం కేటాయించిన భూములను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మర్రిపల్లి గూడెంలో కోటి వరాల పథకం కింద 2001లో 20 మంది బీసీ కులాలకు సర్వే నెంబర్ 824/A, 825, 826/A, 833/A, 833/B, లలో 6 ఎకరాల 3 గుంటల భూమిని కేటాయించినట్టు వివరించారు. ఈ భూమిని ఇరవై ఏళ్ల నుంచి బీసీ కులస్తులు కాపాడుతూ వస్తున్నారన్నారు. ప్రస్తుతం ఈ భూమిని రైతు వేదిక కోసం కేటాయిస్తున్నామని ప్రభుత్వ అధికారులు సర్వే చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే తమ ప్రయత్నాలు విరమించుకోవాలని లేని పక్షంలో జిల్లా, రాష్ట్ర, వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఉద్యమిస్తుందని ఆయన హెచ్చరించారు.



Next Story

Most Viewed